By: ABP Desam | Updated at : 11 Oct 2022 10:22 AM (IST)
Edited By: Arunmali
మరో సిమెంట్ కంపెనీ మీద కన్నేసిన గౌతమ్ అదానీ
Adani Group: వ్యాపార విస్తరణలో దూసుకుపోవడం అనే మాటకు ఒక మనిషి రూపాన్ని ఇస్తే, అది అచ్చం గౌతమ్ అదానీలాగే ఉంటుంది. ఆయన దూకుడు అట్టా ఉంది మరి. ఒకప్పుడు టాటాలు, తర్వాత అంబానీలు, ఇప్పుడు అదానీ.. అదీ, ఇదీ అని తేడా లేకుండా కనిపించిన ప్రతి వ్యాపారంలో వేలు పెట్టడమే వీళ్ల పని.
రూ.5,000 కోట్లు
అసలు విషయానికి వస్తే... తన ఖాతాలో మరో సిమెంట్ కంపెనీని జమ చేసుకోవడానికి అపర కుబేరుడు గౌతమ్ అదానీ ఉవ్విళ్లూరుతున్నారు. రుణాల భారం మోయలేక అల్లాడుతున్న జేపీ గ్రూప్‌లోని (JP Group) సిమెంట్ వ్యాపారాలను సుమారు 5,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు ఒప్పందం కోసం రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఆధిపత్య స్థాయికి చేరడం లక్ష్యం
6.5 బిలియన్ డాలర్లతో అంబుజా సిమెంట్స్, ACC కొనుగోలును అదానీ గ్రూప్ ఇటీవలే పూర్తి చేసింది. ఈ రెండింటి వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 67.5 మిలియన్ టన్నులు (MTPA). ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, 119.95 MTPAతో ఈ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది. తాను రెండో స్థానంలో ఉండడం అదానీకి నచ్చలేదు. రాబోయే ఐదేళ్లలో తన సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 140 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ ఇది వరకే ప్రకటించింది. అంటే, భారత సిమెంట్ రంగంలో ఆధిపత్య స్థాయికి చేరడం అదానీ లక్ష్యం. ఈ ప్లాన్ ప్రకారమే సిమెంట్ రంగంలో మరిన్ని కొనుగోళ్లకు తెర తీసింది. అందులో భాగమే జేపీ పవర్ వెంచర్స్‌కు చెందిన నిగ్రీ సిమెంట్ యూనిట్‌ను కొనుగోలు చేయబోతోంది.
ఈ ఒప్పందం పూర్తయితే, జేపీ గ్రూప్ నుంచి 10 మిలియన్ టన్నుల (MTPA) సామర్థ్యాన్ని అదానీ గ్రూప్ పొందుతుంది.
రుణ భారాన్ని తగ్గించుకోవడానికి తన సిమెంట్ యూనిట్‌ను విక్రయించాలని నిర్ణయించినట్లు జేపీ గ్రూప్ ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఎవరికి అమ్మాలని నిర్ణయించుకుందో ఆ సమాచారంలో వెల్లడించలేదు. కంపెనీ బోర్డు సైతం సిమెంట్ యూనిట్ విక్రయానికి ఆమోదం తెలిపింది. అదానీ గ్రూప్‌తో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి, గౌతమ్ అదానీయే ఆ సిమెంట్ ప్లాంటును కొనుగోలు చేయవచ్చని మార్కెట్ నమ్ముతోంది. అయితే, అటు అదానీ గ్రూప్ గానీ, ఇటు జయప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్ గానీ ఇంతవరకు అధికారింకంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. ఒక వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?