By: ABP Desam | Updated at : 06 Sep 2022 01:41 PM (IST)
Edited By: Arunmali
కొత్త మైలురాయిని చేరిన డీమ్యాట్ ఖాతాల సంఖ్య
Demat Accounts: గత రెండేళ్లుగా స్టాక్ మార్కెట్ వెంట పడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆర్థిక అవగాహన పెరగడం లేదా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు సంపాదించొచ్చన్న ఆలోచనతో మన దేశంలో పెట్టుబడిదారుల సంఖ్య, కొత్త డీమ్యాట్ అకౌంట్ల నంబర్ హనుమంతుడి తోకలా పెరుగుతూనే ఉన్నాయి. కొవిడ్ కాలం నుంచి చూస్తే, ఊహించలేనంతగా ఈ నంబర్లు మారిపోయింది.
కొవిడ్-19 వ్యాప్తికి ముందు, 2020 మార్చిలో, కేవలం 40.9 మిలియన్లుగా (4.9 కోట్లు) ఉన్న డీమ్యాట్ అకౌంట్లు, ఈ ఏడాది ఆగస్టు నాటికి రెట్టింపునకు పైగా పెరిగాయి. మన దేశంలో మొదటిసారిగా 100 మిలియన్ల (10 కోట్లు) మార్కును అధిగమించాయి.
డిపాజిటరీ సంస్థలు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (CDSL) విడుదల చేసిన డేటా ప్రకారం, ఒక్క ఆగస్టు నెలలోనే 22 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. గత నాలుగు నెలల్లో ఇది గరిష్ట నంబర్. ఈ మొత్తంతో, 100.5 మిలియన్లకు (10.05 కోట్లు) డీమ్యాట్ అకౌంట్లు చేరాయి.
ఖాతాల సంఖ్య పరంగా చూస్తే, లిస్టెడ్ కంపెనీ అయిన CDSLకు ఎక్కువ మార్కెట్ వాటా ఉంది. కస్టడీలో ఉన్న ఆస్తుల (AUC) విషయానికి వస్తే NSDL ముందంజలో ఉంది. ఆగస్టు చివరి నాటికి... రూ.38.5 లక్షల కోట్ల AUCతో 71.6 మిలియన్ల డీమ్యాట్ ఖాతాలను CDSL నిర్వహించింది. రూ.320 లక్షల కోట్ల AUCతో NSDL వద్ద 28.9 మిలియన్ ఖాతాలున్నాయి.
డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య పెరిగిపోవడంతో, గత రెండేళ్లలో NSDL AUC విలువ దాదాపు డబులైంది. 2020 ఏప్రిల్‌లోని రూ.174 ట్రిలియన్ల (రూ.174 లక్షల కోట్లు) నుంచి 2022 ఆగస్టు నాటికి రూ.320 ట్రిలియన్లకు (రూ.320 లక్షల కోట్లు లేదా $4 ట్రిలియన్లు) పెరిగింది.
ఈ ఉప్పెనకు కారణమేంటి?
భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో.. కరోనా ముందు, కరోనా తర్వాత అంటూ స్పష్టమైన విభజన గీత గీయవచ్చు. కరోనా ముందు స్టాక్ మార్కెట్ల మీద ఎక్కువ మందికి అవగాహన లేదు. అవగాహన ఉన్నవాళ్లు కూడా నష్టాల భయంతో దూరంగా ఉండిపోయారు. కరోనా సమయంలో విపరీతంగా పడ్డ మార్కెట్లు అక్కడి నుంచి వేగంగా పుంజుకుని సిరులు కురిపించాయి. అప్పటికే మార్కెట్‌లో ఉన్నవాళ్లు కుప్పలు తెప్పలుగా సంపాదించారు. వాళ్లను చూసి మిగిలిన వాళ్లు కూడా మార్కెట్ల వెంట పడడం మొదలు పెట్టారు. లాక్‌డౌన్లు, ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్), ఖాళీ సమయాలు ఎక్కువగా దొరకడం, డీమ్యాట్ ఖాతా తెరవడంలో సౌలభ్యం, నామమాత్రపు బ్రోకరేజీ ఫీజులు, చేతిలో స్మార్ట్‌ఫోన్, అతి తక్కువ డేటా వ్యయం వంటివి కూడా మార్కెట్ల మీద జనం దృష్టి పెట్టడానికి కారణమయ్యాయి. పైగా, అత్యవసర పరిస్థితుల కోసం పొదుపు మొత్తం ఉండాలన్నది కరోనా నేర్పిన పాఠం. ఈ కారణం వల్ల కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులను పొదుపు మంత్రంగా భావిస్తున్నారు. సాధారణంగా బంగారం, స్థిరాస్తుల్లోనే పెట్టుబడులు పెట్టే భారతీయులు, ఆ లిస్టులోకి ఇప్పుడు షేర్ మార్కెట్‌ను చేర్చారు.
ఖాతాలన్నీ నిఖార్సేనా?
ఇదే సమయంలో, 10 కోట్ల ఖాతాలు నిఖార్సయినవనే చెప్పలేం. కొంతమంది మోసపూరితంగా ఎక్కువ ఖాతాలు ఓపెన్ చేయవచ్చు లేదా ఒకే పెట్టుబడిదారుడు వివిధ బ్రోకరేజీల వద్ద ఖాతాలు తెరవవచ్చు. కాబట్టి డూప్లికేషన్ కూడా ఉండవచ్చు. ఇలాంటి వాటిని తీసేస్తే, పెట్టుబడిదారుల సంఖ్య నికరంగా 60 మిలియన్ల నుంచి 70 మిలియన్ల ( 6 కోట్ల నుంచి 7 కోట్లు) మధ్య ఉంటుందన్నది మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ల అంచనా.
డీమ్యాట్ ఖాతాల ట్రెండ్‌కు, పెట్టుబడిదారుల సంఖ్యకు పరస్పర సంబంధం ఉంది. మార్కెట్‌లో షార్ప్ కరెక్షన్ తర్వాత, జూన్‌లో కొత్త డీమ్యాట్ ఓపెనింగ్‌లు 16 నెలల కనిష్ట స్థాయి 1.8 మిలియన్లకు పడిపోయాయి. జూన్ కనిష్ట స్థాయిల నుంచి మార్కెట్లలో వేగవంతమైన రీబౌండ్ కారణంగా, పెట్టుబడిదారుల విశ్వాసం మెరుగుపడింది, కొత్త ఖాతాల సంఖ్య పెరిగింది.
బ్రోకరేజీలు కొత్త నగరాల్లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నందున, ఇంకా సుదీర్ఘ రన్‌వే ఉందని మార్కెట్ ప్లేయర్లు విశ్వసిస్తున్నారు.
సోమవారం సెషన్ ముగిసిన తర్వాత మొత్తం ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,79,81,536 కోట్లు కాగా, టాప్-10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,352,864 కోట్లుగా ఉంది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
IMD Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం, ఏపీకి ముంచుకొస్తున్న ఫెంగల్ తుపాను తుప్పు - 4 రోజులు భారీ వర్షాలు
Fake PM Kisan Yojana App: ఈ యాప్ డౌన్‌లోడ్ చేశారంటే - మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయినట్లే!