By: Arun Kumar Veera | Updated at : 08 Apr 2024 03:18 PM (IST)
భారీ ఐపీవో కోసం ముమ్మర సన్నాహాలు
Vishal Mega Mart IPO: బడ్జెట్ ధరల్లో సరుకులు అమ్మే రిటైల్ స్టోర్ట ఆపరేటర్ 'విశాల్ మెగా మార్ట్', తన పేరును స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయడానికి తొందరపడుతోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ప్రారంభించేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాదే ఈ IPO ప్రారంభం కావచ్చు. ఈ పబ్లిక్ ఆఫర్‌ను నిర్వహించడం కోసం విశాల్ మెగా మార్ట్ కొన్ని బ్యాంకులతో చర్చలు ప్రారంభించింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, విశాల్ మెగా మార్ట్ IPO పరిమాణం 850 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చు. అంటే, దాదాపు 8,300 కోట్ల రూపాయల ఐపీవో ఇది. ఈ ఆఫర్‌ను తీసుకొచ్చేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఈ కంపెనీ చర్చలు ప్రారంభించింది. ఈ సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి విశాల్ మెగా మార్ట్ IPOను ప్రారంభించడంలో ఈ రెండు బ్యాంకులు సాయం చేస్తాయని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది.
దీనికిముందు, గత నెలలో రాయిటర్స్ కూడా ఇదే విధంగా రిపోర్ట్ చేసింది. విశాల్ మెగా మార్ట్ IPO సైజ్ ఒక బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని చెప్పింది. రిటైల్ స్టోర్ల చైన్‌ను నడుపుతున్న విశాల్ మెగా మార్ట్ కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేయవచ్చని ఆ రిపోర్ట్‌లో రాయిటర్స్ రాసింది. బిలియన్ డాలర్ల IPOను 2024లో ఈ కంపెనీ ప్రారంభించొచ్చని వెల్లడించింది.
చిన్న పట్టణాల్లో పాతుకుపోయిన విశాల్ మెగా మార్ట్
ప్రస్తుతం, కేదార్ క్యాపిటల్, స్విస్ సంస్థ పార్టనర్స్ గ్రూప్ యాజమాన్యంలో విశాల్ మెగా మార్ట్ కొనసాగుతోంది. ఈ ప్రమోటర్ కంపెనీలు రెండూ తమ వాటాలో కొంత భాగాన్ని IPO ద్వారా అమ్మకానికి పెట్టే అవకాశం ఉంది. ఈ రెండు సంస్థలు కలిసి 6 సంవత్సరాల క్రితం, 2018లో ఈ రిటైల్ చైన్‌ను కొన్నాయి. ఆ సమయంలో దాదాపు 350 మిలియన్ డాలర్లకు ఈ డీల్ జరిగింది. ప్రస్తుతం, విశాల్ మెగా మార్ట్‌కు దేశవ్యాప్తంగా 560 స్టోర్లు ఉన్నాయి. తక్కువ ధరకు బట్టలు, కిరాణా సరుకులను అమ్మడం విశాల్ మెగా మార్ట్ ప్రత్యేకత. అందువల్ల ఈ కంపెనీ స్టోర్లు చిన్న నగరాలు, పట్టణాల్లో బాగా పాపులర్ అయ్యాయి.
కంపెనీ ఆదాయం & నికర లాభం
ఇండియా రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో విశాల్ మెగా మార్ట్ ఆదాయం 36 శాతం పెరిగి రూ.7,590 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో కంపెనీ నికర లాభం 60 శాతం పెరిగి రూ.320 కోట్లకు చేరుకుంది. భారతదేశ రిటైల్ మార్కెట్ అంచనా పరిమాణం ప్రస్తుతం 840 బిలియన్ డాలర్లు. 2033 నాటికి ఇది 2 లక్షల కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పసిడిలో పెట్టుబడి పెడతారా?, బోలెడు మార్గాలు, ఆన్‌లైన్‌లోనే పని పూర్తి
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ