By: Arun Kumar Veera | Updated at : 20 Apr 2024 01:40 PM (IST)
ఓలాకు హెలో చెబుదామా?, త్వరలో ఐపీవో మార్కెట్‌లోకి ఎంట్రీ
Ola Cabs IPO: యాప్ ఆధారంగా క్యాబ్ సేవలు అందిస్తున్న ఓలా క్యాబ్స్, స్టాక్ మార్కెట్‌లోకి దూసుకురాబోతోంది. వీలైనంత త్వరగా 'ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్' (IPO) ప్రారంభించాలని ఈ క్యాబ్ కంపెనీ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరో మూడు నెలల్లోగా ఓలా క్యాబ్స్ IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం అవుతుందని, ఈ పబ్లిక్ ఆఫర్ ద్వారా 4 వేల కోట్ల రూపాయలకు పైగా సేకరించడానికి కంపెనీ ప్రయత్నించవచ్చని సమాచారం.
వచ్చే మూడు నెలల్లో ప్రైమరీ మార్కెట్‌లోకి రానున్న ఓలా క్యాబ్స్, తన ఐపీవో ద్వారా 500 మిలియన్ డాలర్లు సేకరించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. IPO మార్కెట్ నుంచి నిధులు సేకరించే ప్లాన్ ద్వారా, కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లుగా ఓలా క్యాబ్స్ చూపించే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన, ఓలా క్యాబ్స్ ప్రతిపాదిత ఐపీవో పరిమాణం 500 మిలియన్ డాలర్లు ఉండొచ్చు. భారత కరెన్సీలో చెప్పుకుంటే ఇది దాదాపు రూ. 4,168 కోట్లు.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లతో చర్చలు
ప్రతిపాదిత IPO కోసం ఓలా క్యాబ్స్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని రాయిటర్స్ వెల్లడించింది. ఈ పబ్లిక్ ఆఫర్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఓలా క్యాబ్స్ మాతృసంస్థ ANI టెక్నాలజీస్ వివిధ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. IPO లీడ్ బ్యాంకర్‌ను రాబోయే రెండు మూడు వారాల్లో ఖరారు చేయవచ్చు. ఓలాతో చర్చలు జరుపుతున్న పెట్టుబడి బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్‌మన్ సాక్స్, సిటీ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి.
2021లోనూ IPO సన్నాహాలు
ఈ క్యాబ్ కంపెనీ IPOను తీసుకొచ్చేందుకు గతంలోనూ ఓసారి ప్రయత్నించింది. ఇంతకుముందు, 2021లో ఐపీవో సన్నాహాలు చేసింది. ఆ సమయంలో, ఐపీఓ నుంచి రూ. 8,300 కోట్లు సమీకరించాలని ప్లాన్ చేసింది. అయితే, అప్పటి మార్కెట్ ట్రెండ్‌ను చూసి భయపడి IPO ప్లాన్ రద్దు చేసుకుంది. 2021లో, అనేక న్యూ-ఏజ్ టెక్నాలజీ కంపెనీలు భారీ సైజ్ IPOలతో మార్కెట్‌లోకి అడుగు పెట్టాయి. అప్పుడు పేలవమైన మార్కెట్ సెంటిమెంట్ కారణంగా వాటిలో చాలా షేర్ల పని తీరు పడిపోయింది. వాటిలో కొన్ని కంపెనీల షేర్ ధరలు ఇప్పటికీ IPO ధరను అందుకోలేదు. ఈ డౌన్ ట్రెండ్ చూసి భయపడిన కొన్ని కంపెనీలు, తమ IPO ప్లాన్లను రద్దు చేసుకున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో
ఓలా క్యాబ్స్ ఐపీఓ ఖరారైన తర్వాత, ఈ గ్రూప్‌లోని మరో కంపెనీ కూడా పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే ఓలా ఎలక్ట్రిక్ కూడా ఐపీఓ (Ola Electric IPO) స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి (SEBI) ఐపీఓ ముసాయిదాను దాఖలు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది డిసెంబర్‌లో డ్రాఫ్ట్ పేపర్లు సమర్పించింది. సుమారు రూ. 7,250 కోట్ల IPOను ప్రారంభించాలని ఈ సంస్థ యోచిస్తోంది.
ఓలా అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. స్పానిష్, పోర్చుగీస్‌లో "హెలో" అని అర్ధం. హవాయ్‌లో "జీవితం, ఆరోగ్యం, వృద్ధి చెందడం" అని అర్ధం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: గంటన్నర జర్నీ 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది, ఎయిర్ టాక్సీ ఎగరబోతోంది
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Allu Arjun Bail : అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!