By: ABP Desam | Updated at : 13 Mar 2023 02:07 PM (IST)
Edited By: Arunmali
గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీవో ప్రారంభం
Global Surfaces IPO: గ్లోబల్ సర్ఫేసెస్ IPO (Initial Public Offering) ప్రారంభం అయింది. మార్కెట్‌లోని ఒడిదొడుకులను చూసి కొన్ని కంపెనీలు తమ పబ్లిక్ ఆఫర్ నిర్ణయాన్ని రద్దు చేసుకుని వెనుకడుగు వేసిన తరుణంలో, గ్లోబల్ సర్ఫేసెస్ చాలా ధైర్యంగా ముందుకు వచ్చింది.
గ్లోబల్ సర్ఫేసెస్ IPOలో మీరు పార్టిసిపేట్ చేసే ముందు ఈ 10 విషయాలు (Global Surfaces IPO details) తెలుసుకోండి.
1. గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీవో తేదీలు
నేటి (సోమవారం, 13 మార్చి 2023) నుంచి పబ్లిక్ ఆఫర్ ప్రారంభం అయింది. బిడ్స్ వేయడానికి ఇన్వెస్టర్లకు 15 మార్చి 2023 వరకు ఓపెన్‌లో ఉంటుంది.
2. గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీవో ప్రైస్ బ్యాండ్
పబ్లిక్ ఆఫర్‌లో, రూ.133 - 140 మధ్య ధరలను ప్రైస్ బ్యాండ్‌గా (Global Surfaces IPO Price Band) కంపెనీ నిర్ణయించింది.
3. గ్లోబల్ సర్ఫేసెస్ GMP
ఇవాళ ఉదయం 10.35 గంటలకు, గ్రే మార్కెట్‌లో ఒక్కో షేరు రూ. 35 ప్రీమియంతో (grey market premium) చేతులు మారుతోంది. లిస్టింగ్ డే గెయిన్స్‌ను ఇది సూచిస్తోంది.
4. గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీవో సైజ్
అప్పర్ ప్రైస్ బ్యాండ్ (రూ. 140) ప్రకారం, ఐపీఓ ద్వారా రూ. 155 కోట్లు సమీకరించేందుకు గ్లోబల్ సర్ఫేసెస్ సిద్ధమవుతోంది.
5. ఫ్రెష్ షేర్లు - OFS
ఐపీవో ద్వారా 85.20 లక్షల షేర్లను ఫ్రెష్‌గా ఈ కంెపనీ ఇష్యూ చేస్తోంది. 25.5 లక్షల షేర్లను ప్రమోటర్లు మయాంక్ షా, శ్వేతా షా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్ ద్వారా విక్రయిస్తున్నారు.
6. లాట్‌కు ఎన్ని షేర్లు?
IPOలో, 100 షేర్లను ఒక లాట్‌గా గ్లోబల్ సర్ఫేసెస్ నిర్ణయించింది. అంటే, పెట్టుబడిదారులు కనీసం 100 షేర్ల కోసం బిడ్ వేయాలి. ఆ తర్వాత 100 గుణిజాల (100, 200, 300, 400...) ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి.
7. గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీవో లిస్టింగ్ తేదీ
రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE & NSE) మార్చి 23, 2023న గ్లోబల్ సర్ఫేసెస్ షేర్లు లిస్ట్ (Global Surfaces Shares Listing Date) అవుతాయని భావిస్తున్నారు.
8. రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ అవకాశం
ఈ IPOలో, అర్హత గల సంస్థాగత పెట్టుబడిదార్లకు (qualified institutional buyers - QIBs) 50 శాతం కోటా రిజర్వ్ చేశారు. సంస్థాగతేతర పెట్టుబడిదార్లకు (non-institutional investors) 15 శాతం, చిన్న పెట్టుబడిదార్లకు (retail investors) 35 శాతం వాటాను ఖరారు చేశారు. ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సాధారణంగా 15 శాతం పోర్షన్ మాత్రమే కేటాయిస్తారు, ఈ ఐపీవోలో అంతకుమించి అవకాశం ఇచ్చారు.
9. IPO డబ్బుతో విస్తరణ ప్రణాళిక
IPO ద్వారా సేకరించిన మొత్తంలో కొంత భాగాన్ని దుబాయ్‌లో తయారీ ఫ్లాంట్ ఏర్పాటు చేసేందుకు తన అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ సర్ఫేసెస్ FZEలో పెట్టుబడిగా పెట్టనుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకుంటుంది.
10. గ్లోబల్ సర్ఫేసెస్ వ్యాపారం, లాభనష్టాలు
సహజ రాళ్లను ప్రాసెస్ చేయడం, ఇంజినీర్డ్ క్వార్ట్జ్ (engineered quartz) తయారీ వ్యాపారాన్ని గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ చేస్తోంది. ఈ కంపెనీకి రాజస్థాన్‌లో 2 తయారీ యూనిట్లు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ సర్ఫేసెస్ ఆదాయం రూ. 198 కోట్లు. దీనిపై రూ. 35 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. సంస్థ ఆదాయం దాదాపుగా (98%) ఎగుమతుల ద్వారానే వస్తోంది. అంటే, గ్లోబల్ సర్ఫేసెస్ వ్యాపారమంతా విదేశాలపైనే ఆధారపడి నడుస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!