By: ABP Desam | Updated at : 07 May 2022 08:48 PM (IST)
Edited By: Ramakrishna Paladi
డెల్హీవరీ ఐపీవో
ఈ-కామర్స్ లాజిస్టిక్స్ సప్లయర్ కంపెనీ డెల్హీవరీ ఐపీవోకు వస్తోంది. ధరల వివరాలను ప్రకటించింది. ఇష్యూ విలువ రూ.5235 కోట్లుగా ఉంది. ధరల శ్రేణి రూ.462-497గా నిర్ణయించింది. ఐపీవో మే 11న మొదలై 13న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాసెస్ మే 10 మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది.
మొదట రూ.7,460 కోట్ల విలువతో డెల్హీవరీ ఐపీవోకు రావాలని మొదట అనుకుంది. పరిస్థితుల దృష్ట్యా వాల్యూయేషన్‌ను తగ్గించింది. రూ.5,235 కోట్ల విలువతో వస్తోంది. ప్రెష్ ఇష్యూ కింద రూ.4000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.1235 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది.
డెల్హీవరీలో కార్లైల్ గ్రూప్, సాఫ్ట్‌బ్యాంక్‌కు పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు వారితో పాటు సహ వ్యవస్థాపకుల వాటాలను ఉపసంహరిస్తున్నారు. కార్లైల్ గ్రూపునకు చెందిన సీఏ స్విఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.454 కోట్ల విలువైన షేర్లను డైల్యూట్ చేయనుంది. సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్ డోర్‌బెల్ రూ.365 కోట్ల వాటాను విక్రయిస్తోంది. చైనా మూమెంటమ్ ఫండ్‌కు చెందిన డెలీ సీఎంఎఫ్ రూ.200 కోట్ల షేర్లను అమ్మేస్తోంది. టైమ్స్ ఇంటర్నెట్ రూ.165 కోట్ల షేర్లను విక్రయిస్తోంది.
కంపెనీ వ్యవస్థాపకులు కపిల్, భారతీ, మోహిత్ టాండన్, సూరజ్ సహరన్ వరుసగా రూ.5 కోట్లు, రూ.40 కోట్లు, రూ.6 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఇష్యూలో 75 శాతం వరకు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, మిగిలిన 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. డెల్హీవరీ ఇష్యూకు కొటక్ మహీంద్రా క్యాపిటల్స్ కంపెనీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా లీడ్ మేనేజర్లుగా ఉన్నారు. డెల్హీవరీ దేశవ్యాప్తంగా 17,045 పోస్టల్ కోడ్స్‌లో సేవలు అందిస్తోంది.
Our extensive pan-India network and high-quality automation are designed to make the supply chain of businesses more efficient, effective and reliable. Sign up now - https://t.co/Ygo52VVwDQ
— Delhivery (@delhivery) May 6, 2022
.
.
.#Delhivery #SupplyChainSolutions #FreightServices #LogisticsTechnology pic.twitter.com/66TIPrDMU4
Delhivery's seamless tech integration ensures that all your international logistics needs are taken care of in one place. Sign up now - https://t.co/AcEbD1Yk6Y
— Delhivery (@delhivery) May 4, 2022
.
.
.
.#Delhivery #SupplyChainSolutions #SupplyChainManagement #InternationalShipping #ShippingWorldwide pic.twitter.com/aafrhG8yJj
Indias Largest IPOs: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్ ఇచ్చాయ్
Swiggy IPO: బచ్చన్ నుంచి రాహుల్ ద్రవిడ్ వరకు - ఈ కంపెనీ షేర్ల కోసం క్యూ
Hyundai India IPO: దేశ చరిత్రలోనే బాహుబలి ఐపీవో - LIC బాక్స్ బద్దలవుతుంది!
Ola Electric IPO Price Brand : ఐపీవో ధరను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్ - బిడ్స్ దాఖలు చేయాల్సిన తేదీ ఇదే
IPO News: ఐపీవో లాభాల పంట.. లిస్టింగ్ తొలిరోజే బంపర్ లాభాలు!
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు