అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత స్టాక్ మార్కెట్లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయని వెటరన్ ఇన్వెస్టర్ మార్క్ మొబియస్ అంటున్నారు. తన ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్‌లో దాదాపుగా 50 శాతం భారత్, తైవాన్‌కే కేటాయించానని తెలిపారు. ప్రస్తుతం చైనా షేర్లు నష్టాల బాట పట్టాయని మిగతా వాటితో పోలిస్తే లాభాలు రావడం లేదని వెల్లడించారు.
'భారత్ 50 ఏళ్ల ర్యాలీలో ఉంది' అని మొబియస్ అన్నారు. పదేళ్ల క్రితం చైనా మార్కెట్లు ఉన్నట్టుగా భారత్ ఉందని స్పష్టం చేశారు. అప్పుడప్పుడు బేర్ పట్టు బిగించినా, షార్ట్ సెల్లింగ్ జరుగుతున్నా భారత్ మెరుగ్గా ఉందన్నారు. సంస్కరణలు వేగంగా చేపట్టడం, అన్ని రాష్ట్రాల్లోనూ నిబంధనలు ఒకేలా ఉండటం సుదీర్ఘ కాలంలో దేశానికి మేలు చేస్తోందని పేర్కొన్నారు.
2020, మార్చి నుంచి విపరీతంగా ర్యాలీ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీలు తగ్గుతాయని మోర్గాన్ స్టాన్లీ, నొమురా వంటి అనలిస్టులు అంచనా వేస్తోంటే మొబియస్ మాత్రం బుల్లిష్‌గా ఉన్నారు. అతి నియంత్రణ వల్ల చైనా మార్కెట్లు రాణించడం లేదని పేర్కొన్నారు. 'చైనా పరిస్థితి బాగా లేకపోవడంతో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లూ అలాగే ఉంటాయని అనుకుంటున్నారు. కానీ వారు పైపైకి ఎగిసే ఇండియా మార్కెట్లు చూడాలి' అని ఆయన తెలిపారు.
మొబియస్ ఫోర్ట్‌పోలియోలోని ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్‌లో 45 శాతం భారత్, తైవాన్‌కే కేటాయించారు. సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. చైనా మార్కెట్ల పతనం ఇతర దేశాల్లో పెట్టుబడులకు మార్గాలు తెరుస్తోందని ఆయన అంటున్నారు. 'ప్రభుత్వాలు మరింత మెరుగ్గా నియంత్రణ చేపట్టాలి. గుత్తాధిపత్యాన్ని నివారించాలి. మేం చిన్న, మధ్య తరహా కంపెనీలపై ఆసక్తితో ఉన్నాం. ప్రభుత్వ సంస్కరణల వల్ల ఇవి ప్రయోజనం పొందుతాయి' అని మొబియస్ అన్నారు.
Also Read: Online Term Plan: ఆన్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!
Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్ మొదలైంది.. వివరాలు ఇవే!
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి