GST Collection April 2022:


వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఆల్‌టైమ్‌ రికార్డు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దాదాపు రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది గత ఏడాది ఏప్రిల్‌లో వసూలైన మొత్తం కంటే 20% అధికం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి.






మార్చి కంటే


ఈ ఏడాది మార్చిలో వసూలైన రూ.1,42,095 కోట్ల కంటే ఇది రూ.25,445 కోట్లు ఎక్కువ.  ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా గత నెల 20న కేవలం ఒక్కరోజులోనే 9.58 లక్షల లావాదేవీల ద్వారా రూ.57,847 కోట్ల జీఎస్టీ వసూలైంది. దీంతో మొత్తంగా ఏప్రిల్‌లో రూ.1,67,540 కోట్ల రాబడి వచ్చింది.


పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులను దాఖలు చేసేలా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో పలు చర్యలు తీసుకున్నామని ఆర్థిక శాఖ తెలిపింది. దీంతో పాటు కంప్లియెన్స్‌లు సరళీకరించడం, పన్ను ఎగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, మెరుగుపడిన ఆర్థిక కార్యకలాపాల వల్ల ఈ పన్ను వసూళ్లు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది.


ఏ జీఎస్టీ ఎంత?



  • సెంట్రల్‌ జీఎస్టీ (సీజీఎస్టీ): రూ.33,159 కోట్లు

  • స్టేట్‌ జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ): రూ.41,793 కోట్లు

  • వస్తు దిగుమతులపై రూ.36,705 కోట్లతో కలిపి ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.81,939 కోట్లు.

  • సెస్‌ రూపంలో రూ.10,649 కోట్లు 


మొత్తానికి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రాబడి రావడం ఇదే తొలిసారి. 



Also Read: Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ, బిహార్ నుంచి ప్రయాణం అంటూ ప్రకటన


Also Read: Weather Update: దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను, మే 5న ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!