తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు తగ్గాయి. పసిడి గ్రాముకు రూ.15 చొప్పున తగ్గింది. వెండి కిలోకు రూ.100 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,770 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,900గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధర రూ.100 పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,700 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,770గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,900గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,770గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,900 గా ఉంది.


Also Read: Godrej Group Split: గోద్రేజ్‌ గ్రూప్‌ విభజన: రెండుగా విభజించేందుకు సోదరుల కసరత్తు!!


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,060గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,160గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,740గా ఉంది.


ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.6 పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,530 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.


Also Read: Aadhar Card Updates: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!


అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.


Also Read: JioPhone Next: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!


Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోకు సెబీ అనుమతి.. షేర్ల ధర, విలువ, లిస్టింగ్‌ వివరాలు ఇవే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి