Gold Price Today In Hyderabad 22 January 2022: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. తాజాగా హైదరాబాద్‌‌లో రూ.100 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,650 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,800గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,300 అయింది.


ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,300కు ఎగబాకింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,100 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 కు ఎగబాకింది. ముంబయిలో రూ.50 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,640 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,640 అయింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారంపై రూ.120 పెరగడంతో తులం ధర రూ.45,940 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,120కు చేరింది.


తగ్గిన ప్లాటినం ధర
మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర వరుసగా మూడోరోజు పెరిగింది. నేడు ధర తగ్గడంతో హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.24,740 అయింది. ఢిల్లీలో రూ.41 మేర తగ్గడంతో రూ.24,740కి పతనమైంది. ఇక చెన్నైలో రూ.18 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.24,740 గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం హైదరాబాద్ ధర వద్దే మార్కెట్ అవుతోంది.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి. 


Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు


Also Read: Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి


Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య


Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి