Cryptocurrency Prices Today, 9 December 2021: క్రిప్టో కరెన్సీలు గురువారం తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 1.44 శాతం తగ్గి రూ.39.86 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.70 లక్షల కోట్లకు తగ్గిపోయింది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 0.04 శాతం తగ్గి రూ.3,50,065 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.39 లక్షల కోట్లుగా ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 2.39 శాతం పెరిగి రూ.48,257, టెథెర్‌ 0.02 శాతం తగ్గి రూ.80.50, సొలానా 0.26 శాతం పెరిగి రూ.15,345, కర్డానో 0.95 శాతం తగ్గి రూ.111, యూఎస్‌డీ కాయిన్‌ 0.05 శాతం తగ్గి రూ.80.46 వద్ద కొనసాగుతున్నాయి. టెర్రా, న్యూమెరారి, సుషి, గ్రాఫ్‌, ఎయిర్‌స్వాప్‌, ఫెచ్‌, అవె లాభాల్లో ఉన్నాయి. ఈఓఎస్‌, ఇంటర్నెట్‌ కో, అయిలెఫ్‌, పాలీగాన్‌, కాంపౌండ్‌, వేవ్స్‌, ఎన్‌ఈవో నష్టాల్లో కొనసాగుతున్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?


Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!


Also Read: Forbes Most Powerful Women: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 'భారతీయం'.. నిర్మలా, కమలా హారిస్‌కు చోటు


Also Read: Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?


Also Read: Indian Mobile Congress 2021: మెరుపు వేగంతో దేశంలో 5Gని ప్రవేశపెట్టాలన్న ముకేశ్ అంబానీ


Also Read: Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి