Cryptocurrency Prices Today, 24 December 2021: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం జోరుమీదున్నాయి. కీలక క్రిప్టోలను ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 6.07 శాతం పెరిగి రూ.40.23 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.72.69 లక్షల కోట్లుగా ఉంది.  బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ 4.19 శాతం పెరిగి రూ.3,22,356 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.36.71 లక్షల కోట్లుగా ఉంది.


బైనాన్స్‌ కాయిన్‌ 4.17 శాతం పెరిగి రూ.43,201, టెథెర్‌ 0.01 శాతం తగ్గి రూ.78.83, సొలానా 6.46 శాతం పెరిగి రూ.15,020, రిపుల్‌ 0.27 శాతం పెరిగి రూ.77.46, కర్డానో 8.46 శాతం పెరిగి రూ.115 వద్ద కొనసాగుతున్నాయి. ది సాండ్‌బాక్స్‌, ఇంటర్నెట్‌ కో, క్వార్క్‌ చైన్‌, టెర్రా, డ్యా్‌, డీసెంట్రల్‌ల్యాండ్‌, సుషి 12 నుంచి 21 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. రిపబ్లిక్‌, యార్న్‌ ఫైనాన్స్‌, టెథెర్‌, పాక్స్‌ డాలర్‌ 0 నుంచి 7 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.


భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!


Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్‌


Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ విలువ.. మిగతావీ??


Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్‌ లిస్టింగ్‌ సూపర్‌హిట్‌.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?


Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు


Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.