Union Budget Live 2023 Updates: రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు - నిర్మలా సీతారామన్

Union Budget Live 2023 Updates: కేంద్ర బడ్జెట్‌ 2023-24 లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఈ పేజ్‌ను రీఫ్రెష్‌ చేస్తూ ఉండండీ.

ABP Desam Last Updated: 01 Feb 2023 12:41 PM
రూ.3-6 లక్షల వరకూ 5% పన్ను

రూ. 7 లక్షల ఆదాయం దాటితే..రూ.3-6 లక్షల వరకూ 5% పన్ను. రూ.6-9 లక్షల వరకూ 7% ట్యాక్స్. రూ.9-12 లక్షల వరకూ 12% పన్ను- కేంద్ర ఆర్థిక మంత్రి 

రూ.7 లక్షల వరకూ నో ట్యాక్స్

రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు. ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను. రూ.15 లక్షలు దాటితేనే 30% ట్యాక్స్ - కేంద్ర ఆర్థిక మంత్రి 

ద్రవ్యలోటు 5.9శాతం

ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 5.9శాతం గా ఉంటుందని ఆర్థికమంత్రి అంచనా వేశారు. 

ట్యాక్స్‌ పోర్టల్‌లో రోజూ 72 లక్షల అప్లికేషన్‌లు

ట్యాక్స్‌ పోర్టల్‌లో రోజూ 72 లక్షల అప్లికేషన్‌లు వస్తున్నాయి. 16 రోజుల్లోనే రీఫండ్ చేసేలా వెసులుబాటు కల్పించాం. ఈ ప్రక్రియను మరింత సులభం చేస్తాం - కేంద్ర ఆర్థిక మంత్రి 

విద్యుత్ వాహనాల ధరలు భారీగా తగ్గింపు

బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు. టీవీలు, మొబైల్ ఫోన్‌ ధరలు తగ్గింపు. విద్యుత్ వాహనాల ధరలు భారీగా తగ్గింపు - కేంద్ర ఆర్థిక మంత్రి 

దూసుకెళ్తున్న మార్కెట్లు

నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంతో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి.  బీఎస్ఈ ఒకానొక దశలో  640 పాయింట్లు లాభపడి 60, 189 పాయింట్లను దాకింది. ప్రస్తుతం  60,066 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 137 పాయింట్లు లాభపడి 17,799 వద్ద కొనసాగుతోంది. 

మహిళలకు కొత్త సేవింగ్ స్కీమ్

అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కొత్తగా మహిళా సమ్మాన్ బచత్ పత్రా పొదుపు పథకం ప్రారంభిస్తాం. మహిళలు, బాలికలు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రూ.2 లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు. వడ్డీ రేటు 7.5గా ఉంటుంది. - కేంద్ర ఆర్థిక మంత్రి 

యువత కోసం నగదు బదిలీ పథకం

వచ్చే మూడేళ్లలో 47లక్షల మంది యువతకు ప్రయోజనం కలిగేలా ప్రత్యేకమైన నగదు బదిలీ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. 

MSMEలకు రూ.2 లక్షల కోట్ల రుణాలు

ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ని ప్రారంభిస్తాం. తద్వారా MSMEలకు రూ.2 లక్షల కోట్ల రుణాలు - కేంద్ర ఆర్థిక మంత్రి 

కరవు ప్రాంత రైతులకు రూ.5,300కోట్లు

ఎన్నికలు జరగనున్న కర్ణాటకు ప్రత్యేక నిధులు కేటాయింపు. ఫార్మా, మెడికల్ డివైజెస్‌ సెక్టార్‌లకు ప్రాధాన్యతనిస్తాం. కరవు ప్రాంత రైతులకు రూ.5,300కోట్లు నిధులు అందిస్తాం.-కేంద్ర ఆర్థిక మంత్రి 

పీఎం ప్రణామ్

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంపొందించడానికి పీఎం ప్రణామ్ అనే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. 

SEBI మరింత పవర్‌ఫుల్

సెబీని మరింత శక్తిమంతంగా తయారు చేస్తాం. డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్‌లు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఎక్కువ మంది భాగస్వామ్యం ఉండేలా చూస్తాం. -  -కేంద్ర ఆర్థిక మంత్రి 

పెట్టుబడి వ్యయం పెంపుతో అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్

వరుసగా మూడో ఏడాది పెట్టుబడి వ్యయం పెరగడంపై పరిశ్రమ  వర్గాలు సంతోషం. భారత్ మాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాపిటల్ వ్యయం జీడీపీలో 3.3శాతానికి చేరింది. 

30 స్కిల్ ఇండియా సెంటర్‌లు

విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా 30 స్కిల్ ఇండియా సెంటర్‌లు ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు స్కిల్ యూత్ సెంటర్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. అప్రెంటిస్‌షిప్ స్కీమ్ ద్వారా విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. -కేంద్ర ఆర్థిక మంత్రి 

హైడ్రోజన్ మిషన్‌ కోసం రూ.19,700 కోట్లు

పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రంగంలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. హైడ్రోజన్ మిషన్‌ కోసం రూ.19,700 కోట్లు కేటాయించాం. కాలుష్యం తగ్గించేందుకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం. -కేంద్ర ఆర్థిక మంత్రి 

33 శాతం పెరిగిన పెట్టుబడి వ్యయం

ఈ బడ్జెట్ లో పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 33శాతం కేటాయింపులు పెంచడం ద్వారా 10లక్షల కోట్లు కేపిటల్ వ్యయం చేస్తామని ఇది జీడీపీలో 3.3శాతానికి సమానమని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2020 తో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ 

విద్యుత్ రంగానికి రూ.35 వేల కోట్లు

పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తాం. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 మంది ఉపాధ్యాయులను నియమిస్తాం. విద్యుత్ రంగానికి రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నాం. -  కేంద్ర ఆర్థిక మంత్రి 

కేవైసీ ప్రక్రియ సులభతరం

డిజిటలైజేషన్‌లో భాగంగా KYC ప్రక్రియను సులభతరం చేస్తాం. పదేపదే వ్యక్తిగత వివరాలు అందించే పని లేకుండా చేస్తాం. -  కేంద్ర ఆర్థిక మంత్రి 

త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కేంద్రాలు

ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలు పెంచేందుకు మిషన్ కర్మయోగి ప్రారంభించాం. ఈ ఆన్‌లైన్ ట్రైనింగ్ ప్లాట్‌ఫామ్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ, ఆరోగ్య రంగాలన్ని సమస్యలు పరిష్కరిస్తాం - కేంద్ర ఆర్థిక మంత్రి 

రైల్వేకు అత్యధిక బడ్జెట్

11.7 కోట్ల మందికి ఉచిత టాయిలెట్స్‌ కట్టించిం ఇచ్చాం. పర్యాటక రంగ అభివృద్ధికీ ప్రాధాన్యత కల్పించాం. రైల్వేకు అత్యధికంగా రూ.2.40లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం. 2014తో పోల్చి చూస్తే ఇది 9 రెట్లు అధికం. -  కేంద్ర ఆర్థిక మంత్రి 

మౌలిక వసతుల అభివృద్ధికి అధిక నిధులు

వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్ల రుణాలు అందజేస్తాం. ఎస్టీ వర్గాలకు రూ.15 వేల కోట్లు కేటాయిస్తాం. మౌలిక వసతుల అభివృద్ధికి 33% అదనపు నిధులు అందజేస్తాం - కేంద్ర ఆర్థిక మంత్రి 

మహిళల సాధికారతకు మరి కొన్ని పథకాలు

దళితుల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తీసుకొస్తాం. మహిళల సాధికారతకు మరి కొన్ని పథకాలూ రూపొందిస్తాం. వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం కల్పిస్తాం. రైల్వే, రోడ్‌ సెక్టార్లలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తాం. 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పెట్టుబడులను పెంచుతున్నాం.  -  కేంద్ర ఆర్థిక మంత్రి 

మిలెట్స్‌కి గ్లోబల్ హబ్‌గా భారత్


శ్రీ అన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు సహకారం అందిస్తాం. పీఎం మత్య్స సంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయిస్తాం. త్వరలోనే భారత్...తృణధాన్యాలకు గ్లోబల్ హబ్‌గా మారుతుంది. మిలెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందేలా చేయడమే కాదు. ఆహార భద్రతకూ భరోసా ఇస్తున్నాం. -  కేంద్ర ఆర్థిక మంత్రి 

త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ ఏర్పాటు


త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ని ఏర్పాటు చేస్తాం. 100వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా ఎదుగుతుంది. గ్రామీణ మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధి జరిగింది. భవిష్యత్‌లో ఈ సాయం ఇంకా పెరుగుతుంది. ఆత్మ నిర్భరత భారత్‌కు ఇది నిదర్శనం. గ్రామీణ మహిళలకు సాయం చేయడమే కాదు. వారు నైపుణ్యాలు పెంచుకునేందుకూ తోడ్పడుతున్నాం. సామాజిక భద్రతనూ కల్పిస్తున్నాం- కేంద్ర ఆర్థిక మంత్రి 

సాగు రంగంలో అంకుర సంస్థలకు తోడ్పాటు

ఈ బడ్జెట్‌లో కీలకంగా 7 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. దేశంలో గత కొన్నేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపైంది. గతంలో కన్నా భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్గనైజ్డ్‌గా మారింది. ప్రజల జీవన శైలి కూడా మారింది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రత్యేక నిధులు అందించి సాగు రంగంలో అంకుర సంస్థలకు తోడ్పాటనందిస్తాం. సవాళ్లు ఎదుర్కొనే రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వెనకబడిన వర్గాలకు ప్రియారిటీ ఇస్తాం. - 

సామాన్యుల సాధికారతే లక్ష్యం

సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్‌ల విషయంలో భారత్‌ అనూహ్య వృద్ధి సాధించింది. పీఎం సురక్ష, పీఎం జీవన జ్యోతి యోజన పథకాల కింద 220 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు అందించాం. కోట్లాది మంది ప్రజలు పీఎం కిసాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారు. సామాన్యుల సాధికారతకు ఈ బడ్జెట్ నిదర్శనం. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదంతో ప్రభుత్వం అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందజేస్తోంది. 28 నెలల్లోనే 80 కోట్ల మంది ఆహార ధాన్యాలు అందించడం సామాన్య విషయం కాదు - కేంద్ర ఆర్థిక మంత్రి 

ఈ బడ్జెట్ వచ్చే 25 ఏళ్ల  భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది

అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్. ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురైనా భారత్‌ ఆర్థికంగా వెలుగొందింది. 7% ఆర్థిక వృద్ధి రేటుతో భారత్ దూసుకుపోతుందని అంచనాలు వచ్చాయి. ప్రపంచ దేశాల్లో ఇది అత్యధికం. దేశంలోని అన్ని రంగాలకూ సముచిత ప్రాధాన్యత ఇచ్చాం.
యువతతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బాటలు వేశాం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగించినా...భారత్ మాత్రం తట్టుకుని నిలబడింది. పురోగతి దిశగా దూసుకుపోతోంది. భారత్‌ అభివృద్ధిని చూసి ప్రపంచమంతా కొనియాడుతోంది. ఈ బడ్జెట్ వచ్చే 25 ఏళ్ల 
భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. కొవిడ్ వ్యాక్సినేషన్‌తో భారత్‌ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఎస్సీ, ఎస్టీ,ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ తయారు చేసాం. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పయనిస్తోంది - కేంద్ర ఆర్థిక మంత్రి 

బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక మంత్రి

భారత ఆర్థిక వ్యవస్థ ఒక ప్రకాశవంతమైన నక్షత్రం అని ప్రపంచం అంగీకరించింది. మన ఆర్థిక వ్యవస్థ 7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధికం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ప్రారంభం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక లెక్కలు అందరి ముందుకు వస్తున్నాయి. .


పార్లమెంట్‌కు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ హౌస్ కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.  

రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఆమె వెంట ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అనుసరించే సాధారణ పద్ధతి ఇది.

Background

2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఇదే మోడీ ప్రభుత్వం  రెండో టర్మ్ చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం (ఫిబ్రవరి 1) పార్లమెంటులో 2023 కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి ఐదో కేంద్ర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. ఒక విధంగా చూసుకుంటే ఇది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్న బడ్జెట్‌గాని చెప్పుకోవాలి.


మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాంటి పద్దుతో వస్తుందో అన్న ఆసక్తి సామాన్యుడి నుంచి బడా పారిశ్రామిక వేత్త వరకు ఉంది.  ఈ బడ్జెట్‌పై ప్రధాన పరిశ్రమల నుంచి కుటీర పరిశ్రమల వరకు, రైతుల నుంచి వేతన జీవుల వరకు, విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అందరూ ఈ బడ్జెట్‌లో  కొంత ఉపశమనం పొందాలని చూస్తున్నారు.
2023వ సంవత్సర బడ్జెట్ సందర్భంగా 23 ప్రధాన అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. 
ఆదాయ పన్ను
1. పన్ను చెల్లింపుదారులు ప్రస్తుత ఉన్న పన్ను పరిమితి 2.5 లక్షల నుంచి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు మరింత మినహాయింపు ఉంటుందని ఆశిస్తున్నారు. 
2. వేత జీవులు 80C కింద ఇచ్చే మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 1.5 లక్షలను రూ. 2.5 లక్షలకు పొడిగించాలని ఆశిస్తున్నారు.
3. ప్రస్తుతం ఒక వ్యక్తి రూ. 25,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంలు, ఖర్చుల కోసం మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. వైద్య ఖర్చులు పెరిగిన దృష్ట్యా పరిమితిని రూ.50 వేలకు పెంచాలని కోరుతున్నారు. 
4. కొత్త పన్ను స్లాబ్ నిర్మాణంలో కొంత వెసులుబాటు ఉంటుందని అనుకుంటున్నారు. హౌస్‌ రెంట్‌, పెట్టుబడులు, బీమా ప్రీమియంలు మొదలైన వాటిపై కాస్త ఉపశమనం ఇస్తారని ఎదురు చూస్తున్నారు. 
విద్యా రంగం
5. గత 50 సంవత్సరాలుగా విద్యపై జీడీపీలో 3 శాతమే ఖర్చు చేస్తున్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యపై ప్రభుత్వ వ్యయం వారి GDPలో 6 శాతం కంటే ఎక్కువగా ఉంది. భారతదేశ పరిమాణం, జనాభా దృష్ట్యా, విద్యా రంగం GDPలో 6 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
6. అధిక-నాణ్యత గల పరిశోధన-ఇంటెన్సివ్ విశ్వవిద్యాలయాలను రూపొందించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓ విశ్లేషణ. నిధులు ఉండాలని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిశోధనను బలోపేతం చేయడానికి చర్యలు.
మౌలిక సదుపాయాల రంగం
7. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల ద్వారా వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ అంచనాలు కొనసాగే అవకాశం ఉంది. PM-గతిశక్తి, జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ (NIP) లక్ష్యాలపై ఫోకస్ చేి దేశం మూలధన వ్యయాన్ని పెంచడానికి బడ్జెట్ 2023లో ప్రయత్నించ వచ్చు. 
8. బడ్జెట్ 2023లో పట్టణ రవాణా, నీటి సరఫరా, పారిశుధ్యం, మురుగునీటి నిర్వహణకు నిధుల కేటాయింపు పెరగడంతో పాటు పట్టణ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని రేటింగ్ ఏజెన్సీ ICRA అంచనా వేస్తోంది.
9. డిమాండ్‌ను సృష్టించడం, ఉపాధిని సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సామర్థ్య విస్తరణకు  మూలధన వ్యయం లక్ష్యం రూ. 9.0-10.5 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా.
10. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి, ద్రవ్య లోటును పరిష్కరించడానికి ప్రభుత్వానికి నిధులు అవసరమయ్యే పరిస్థితిలో పెట్టుబడుల ఉపసంహరణ సహకారం చాలా కీలకమని నిపుణులు అంటున్నారు.
ఆరోగ్య రంగం
11. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్య సంరక్షణ రంగానికి రోగుల సమస్య పరిష్కరించడానికి , నాణ్యమైన సేవలు సరసమైన ధరల్లో పొందేందుకు వాణిజ్యపరంగా తక్కువ మూలధన-ఇంటెన్సివ్ ప్రాజెక్ట్‌లు అవసరం.
12. కరోనా తర్వాత హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ వ్యాప్తిని పెంచడానికి చర్యలు ఉండే ఛాన్స్‌ 


వ్యవసాయ రంగం
13. పంట దిగుబడులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయ-టెక్ స్టార్ట్-అప్‌లకు పన్ను ప్రోత్సాహకాలను అందించడానికి, దిగుమతి సుంకాలను తగ్గించడానికి ప్రభుత్వం PM-KISAN పథకం కింద రైతులకు ఇచ్చే నగదు సహాయాన్ని రూ. 6,000కు పెంచాలి. 
14. భారతీయ వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెసిషన్ ఫార్మింగ్, డ్రోన్‌ల వంటి సాంకేతికతలను వేగంగా స్వీకరించడానికి రైతులకు, అగ్రి-టెక్ స్టార్టప్‌లకు కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది.
15. నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి, వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి జాతీయ మిషన్‌ను ప్రారంభించాలని ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీ బాడీ SEA కూడా డిమాండ్ చేసింది.


రియల్ ఎస్టేట్ రంగం


16. రియల్ ఎస్టేట్ డెవలపర్లు సెక్షన్ 24 ప్రకారం గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచాలని ఆశిస్తున్నారు.


17. మూలధన లాభాల పన్ను రేటును ప్రస్తుత 20 శాతం నుంచి తగ్గించాలని కోరుతున్నారు. రెండు ప్రాపర్టీలలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి మూలధన లాభాలపై రూ. 2 కోట్ల సీలింగ్‌ను కూడా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు. 


స్టార్టప్‌లు


18. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో బొమ్మలు, సైకిళ్లు, లెదర్, పాదరక్షల ఉత్పత్తికి ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం పొడిగించే అవకాశం ఉంది, 
19. కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్ట్-అప్‌లతోపాటు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడిదారుల కోసం పన్ను ఫ్రేమ్‌వర్క్‌లను సరళీకరించాలి. లిస్టెడ్ , అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల మధ్య క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు సమానంగా ఉండాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.
20. చిన్న వ్యాపారాలు తమ రోజువారీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చుకోవడంలో సహాయపడే కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)లో మార్పులు అత్యవసరమని, దీనిని 15 శాతం నుంచి 9 శాతానికి తగ్గించాలని అంటున్నారు.
ఫిన్‌టెక్ ఇండస్ట్రీ
21. జాతీయ డిజిటల్ ID వ్యవస్థను అమలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి చర్యలు ఎక్కువ మంది వ్యక్తులను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో సహాయపడతాయి. తద్వారా వారు ఫిన్‌టెక్ ప్రయోజనాలను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది.
22. ఫిన్‌టెక్ సెక్టార్‌లో ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు మద్దతిచ్చే చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ ఉంది. 
EV సెక్టార్
23. ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమకు చెందిన బ్యాటరీ ప్యాక్‌లు, EV భాగాలపై విధించే కస్టమ్స్ సుంకాలు, దిగుమతి సుంకాలు, GSTలో సవరణను ఆశిస్తోంది. EV బ్యాటరీల ఉత్పత్తిలో బ్యాటరీ తయారీదారులను సులభతరం చేయడానికి ప్రస్తుత 18 శాతం GSTని మినహాయించాలని డిమాండ్ ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.