Bird Flu Latest News: ఆదివారం వచ్చింది. అందరిలో ఒకటే అనుమానం. చికిన్ తినాలా వద్దా అని. చాలా మందికి ఆదివారం వచ్చింది అంటే చాలా ముక్క ఉండాల్సింది. అయితే ఇప్పుడు బర్డ్‌ఫ్లూ వ్యాపించందన్న వార్తలు మాంసాహర ప్రియుల్లో  కొత్త ఆందోళనలకు కారణమవుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్‌, వెస్ట్ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ రావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. చాలా మంది చికెన్ తినడం మానేశారు. బర్డ్‌ఫ్లూ వెలుగు చూసిన ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే సప్లైని ఆపేసింది. ఇప్పటికి కూడా బర్డ్‌ఫ్లూ తగ్గలేదని లక్షల కోళ్లు చచ్చిపోతన్నాయని ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. 

పరిస్థితిని గమనించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాధి లేదని ప్రకటించింది. వారం రోజుల క్రితం బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందిందని తెలిపింది. ఇప్పుడు వ్యాధి ప్రభావం లేనందున నిరభ్యంతరంగా చికెన్ తినొచ్చని సూచించింది. బాగా ఉడికించిన చికెన్, గుడ్‌ తినడంతో ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. 

Also Read: ఏపీలో మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిందా? ఆందోళన చెందవద్దన్న మంత్రి సత్యకుమార్

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ ప్రభావం లేదని చికెన్ తినడానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా ప్రజలు మాత్రం భయపడుతున్నారు. చికెన్ అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. దీంతో చికెన్ రేటు అమాంతం పడిపోయింది. గత వారం 200 రూపాయలకు పైగా ఉన్న చికెన్ ధర ఈ వారానికి వంద రూపాయలకు చేరింది. 

బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌ బిర్యానీలపై కూడా పడింది. తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీల సేల్స్ భారీగా పడిపోయింది. చికెన్‌కు ఆల్ట్రనేటివ్‌గా ఉన్న మటన్, ఫిష్‌ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు జనాలు వాటి కోసం ఎగబడుతున్నారు. 

తెలంగాణలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇక్కడ ఆదివారం వచ్చింది అంటే చాలు ముక్కుల వాసన రావాల్సింది. అలా రాకుంటే అది ఆదివారం కింద లెక్కలోకే రాదు. అయితే ఇప్పుడు బర్డ్‌ఫ్లూ వల్ల చికెన్‌, ఎగ్‌కు బదులు ఫిష్‌, మటన్‌పై ఆధారపడాల్సి వస్తున్నారు. 

మరోవైపు మంచి ముహూర్తాలు ఉన్న సీజన్ కావడంతో వాటిపై కూడా ఈ బర్డ్‌ఫ్లూ ప్రభావం పడుతోంది. ప్రధాన డిష్‌గా ఉన్న చికెన్‌ పెట్టడానికి సంశయిస్తున్నారు. అందుకే ఖర్చు ఎక్కువైనా మటన్, ఫిష్‌ వైపు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఖర్చు ఎక్కువై పోతోంది. 

బర్డ్‌ఫ్లూ భయం వద్దని మంచిగా బాగా ఉడికేలా వండుకొని తినొచ్చని వైద్యులు కూడా చెబుతున్నారు. బర్డ్‌ఫ్లూ వైరస్‌ 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో జీవించలేదని అంటున్నారు. ఇప్పుడు చికెన్ కానీ, గుడ్ కానీ అంత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉడికిస్తారని దీంతో ఫ్లూ చనిపోతుందని వివరిస్తున్నారు. చికెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నీట్‌గా ఉన్న ప్రాంతాల్లోనే చికెన్ కొనుగోలు చేసి వండుకొని తినాలని అంటున్నారు. ఒకటికి రెండుసార్లు వేడి నీటిలో కడిగి ఉడికించాలని చెబుతున్నారు. కేవలం నీట్‌నెస్‌ లేకపోవడంతోనే బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందిందని అంటున్నారు. 

Also Read: బర్డ్‌ఫ్లూ తగ్గిపోయింది- కోడి మాంసం, గుడ్లు భయం లేకుండా తినొచ్చు- ఏపీ మంత్రి కీలక ప్రకటన