Nagpur vendor unique golgappa deal: పానీ పూరి అన్నా గోల్ గప్పా అన్నా ఎగబడేవారు చాలా మంది ఉంటారు. అందుకే సాయంత్రం అయితే రోడ్ల మీద ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. నాగపూర్ లో కూడా అంతే. అక్కడ కూడా విచ్చలవిడిగా గోల్ గప్పా దుకాణాలు ఉన్నాయి. కానీ ఒక్క దుకాణం మాత్రం వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆ దుకాణంలో లైఫ్ టైమ్ పానీపూరి ఆఫర్ ప్రకటించారు. పానీ పూరీలకు కూడా లైఫ్ టైమ్ ఆఫర్లా అని ఆశ్చర్యపోవద్దు. ఆయన అలా ఆలోచించాడు.. వెంటనే పోస్టర్లు వేశాడు.  



ఒక్క సారి మాత్రమే 99వేల రూపాయలు కట్టండి. ఇక జీవితాంతం ఎప్పుడు వచ్చినా పానీ పూరి తినండి అని ఆ ఆఫర్ సారాంశం. అందులో చాలా అతిశయోక్తి ఉందో.. లేకపోతే ఇదేం కామెడీ అనుకున్నారో కానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అతను ఇలాంటి ఆఫర్లు చాలా రోజుల నుంచి ఇస్తున్నాడని అతని దగ్గరకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు చెబుతున్నారు. 





తమ దగ్గర ఒక్క రూపాయి నుంచి 99 వేల వరకూ ఆఫర్లు ఉన్నాయని యజమాని చెబుతున్నారు. 





ఇంతా చేసి అతనికి ఎవరైనా 99వేల రూపాయలు కట్టి లైఫ్ టైమ్ ఆఫర్లు తీసుకుంటారో లేదో కానీ.. అంతకు మించిన ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున లభించింది. అతనిది చిన్న దుకాణం అయినా  నాగపూర్ లో అతని దుకాణాన్ని వెదుక్కుంటూ వచ్చే వారు ఉన్నారు. దీంతో అతని బిజిెనెస్ పెరిగిపోయింది.        


Also Read: శారీరక సంబంధం లేదని ప్రేమ వివాహేతర సంబంధం కాదు - మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు