Chhaava OTT Release: బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన 'ఛావా' - ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్, ఎప్పటి నుంచో తెలుసా?
Chhaava OTT Platform: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన పీరియాడికల్ అడ్వెంచర్ 'ఛావా'. శుక్రవారం విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోగా ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Rashmika's Chhaava OTT Streaming Platform Netflix: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం 'ఛావా' (Chhaava). ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 'ఛావా' ఓటీటీ రిలీజ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్' (Netflix) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్‌కు నెల రోజుల తర్వాత అంటే ఏప్రిల్ రెండో వారంలో సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ 'ఛావా'ను తెరకెక్కించారు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయిగా నేషనల్ క్రష్ రష్మిక నటించి మెప్పించారు. దాదాపు రూ.130 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ రోజే మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ ప్రీ సేల్స్ బుకింగ్స్‌లో ఏకంగా 5 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయని మేకర్స్ తెలిపారు. విడుదలైన మొదటి రోజే 'ఛావా' అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తొలి రోజు రూ.31 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా నిలిచింది.
Also Read: చిరంజీవితో సాయి దుర్గా తేజ్ సినిమా... మామా అల్లుళ్ళ సందడి చూసేందుకు రెడీ అవ్వండమ్మా!
'ఛావా' కథ ఏంటంటే.?
ఆడియన్స్‌ను మెప్పించిన పీరియాడికల్ డ్రామా 'ఛావా' అసలు కథేంటంటే.. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు.. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) భావిస్తాడు. వీరి ఆలోచనలకు చెక్ పెడుతూ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్).. వారిపై ఎదురుదాడికి దిగుతాడు. ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుంచి దోచుకున్న కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు శంభాజీని ఎదుర్కొనేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. సైనికులు, ఆయుధాల పరంగా తమ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన మొఘల్ సామ్రాజ్యం మీద శంభాజీ ఏ విధంగా యుద్ధం చేశాడు? శత్రుసైన్యంతో చేతులు కలిపి శంభాజీకి ద్రోహం చేసింది ఎవరు.?, శంభాజీ మొఘల్ సైన్యానికి చిక్కిన తర్వాత ఆయన భార్య యేసుబాయి (రష్మిక) ఏం చేసింది.? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే మంచి విజయం సాధించింది.
Also Read: ఆ ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'లైలా' - ముందుగానే స్ట్రీమింగ్ అవుతుందా?