Chiranjeevi - Sai Durga Tej: చిరంజీవితో సాయి దుర్గా తేజ్ సినిమా... మామా అల్లుళ్ళ సందడి చూసేందుకు రెడీ అవ్వండమ్మా!

Sai Durga Tej in Chiranjeevi movie: మేనమామ మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అందుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. కానీ, ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే?

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని, ఆయనతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి! ఆ అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. చిరు సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా సరే చేయాలని యంగ్ హీరోలు, ఆర్టిస్టులు చాలా మంది కోరుకుంటున్నారు. అందుకు మెగా ఫ్యామిలీ హీరోలు సైతం అతీతం కాదు. మెగా మేనల్లుడు, సుప్రీమ్ స్టార్ సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej)కు ఇప్పుడు మేనమామ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది.

Continues below advertisement

చిరంజీవి సినిమాలో సాయి దుర్గా తేజ్!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో నటించే అవకాశం సాయి దుర్గా తేజ్ అందుకున్నారు. మామా అల్లుళ్ళు ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే... సాయి దుర్గా తేజ్ ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం లేదు. మేనమామతో కలిసి అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారు.

చిరంజీవి హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'విశ్వంభర' (Vishwambhara). ఈ చిత్రానికి వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఓ అతిథి పాత్రను సాయి దుర్గా తేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో మామా అల్లుళ్ళ మీద సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే వారం కూడా మూడు నాలుగు రోజులు చిత్రీకరణ చేయనున్నారని తెలిసింది. చిరంజీవి మీద శోభి మాస్టర్ కొరియోగ్రఫీలో ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నారు.  బహుశా... ఆ పాటలో మామా అల్లుళ్ళు సందడి చేసే అవకాశం ఉంది. 

'విశ్వంభర'లో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకం మీద విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  

బ్రో... ఆల్రెడీ పవన్, సాయి దుర్గా తేజ్ చేశారు!
మేనమామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని సాయి దుర్గా తేజ్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన సినిమాల్లో నాగబాబు నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో 'బ్రో'లో కలిసి నటించారు సాయి దుర్గా తేజ్. ఇప్పుడు చిరంజీవితో కలిసి నటించే అవకాశం  అందుకున్నారు. ఇది అతిథి పాత్ర కనుక భవిష్యత్తులో ఫుల్ లెంగ్త్ సినిమా చేసే అవకాశం ఉంటుంది.

Also Readలైలా రివ్యూ: డబుల్ మీనింగ్‌లో హీరో డైలాగ్స్... ప్రతి సీన్‌లో హీరోయిన్ స్కిన్ షో.... విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేస్తే చాలా? థియేటర్లలో సినిమాను చూడగలమా?

సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలకు వస్తే... రోహిత్ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'సంబరాల యేటి గట్టు' (Sambarala Yeti Gattu) చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ప్రచార చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా కోసం సాయి దుర్గా తేజ్ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. బాడీ బిల్డ్ చేశారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్ - మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతోంది?

Continues below advertisement