విక్కీ కౌశల్ - రష్మిక మందన్న జంటగా నటించిన చారిత్రాత్మక చిత్రం 'ఛావా'. ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ రాజే భోంస్లే పాత్రను విక్కీ కౌశల్ పోషించగా, ఆయన భార్య మహారాణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న నటించారు. అయితే ఈ మరాఠా మహారాణి స్టోరీ గురించి తెలిస్తే గూస్ బంప్స్ రావడం పక్కా. భర్త బ్రతికి ఉండగానే విధవరాలుగా నటించింది. భర్త చనిపోయాక మొఘలులను, బ్రిటిష్ సైన్యాన్ని వణికించిన మహారాణి యేసు బాయి. ఆమె గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. 


రాణి యేసుబాయి ఎవరు? 
మహారాణి యేసుబాయి సాహెబ్ ఛత్రపతి శంభాజీ రాజే భార్య. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కోడలు. ఛత్రపతి శివాజీ పాలనలో మరాఠాధిపతి పిలాజీ రావు షిర్కె కుమార్తె యేసుబాయి షిర్కె. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత రాణి యేసు బాయి చూపిన ధైర్యం, దౌత్యం రెండూ ప్రశంసనీయం. అప్పట్లోనే ఈ మహారాణి రాజకీయాలపై పట్టుతో ఎలాంటి పరిస్థితి నుంచి అయినా తన సామ్రాజ్యాన్ని కాపాడుకోగలిగిన సాహస ధైర్యాలు ఉన్న మహిళ. 1680 నుంచి 1770 వరకు మరాఠా సామ్రాజ్యం అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంది. ఆ టైంలో ఆమె చూపించిన తెగువ, సహకారం కారణంగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని జయించలేకపోయాడు. 



మొఘలులకు, బ్రిటిష్ వారికి దడ పుట్టించిన రాణి 



దృఢ సంకల్పంతో పట్టు విడవని లక్షణం కలిగిన మహారాణి త్వరగానే తన మామ శివాజీ మహారాజ్ నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఛత్రపతి శివాజీ రాజా పాలనలో 1681-1689 మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 6 లక్షలకు పైగా సైన్యంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. అప్పట్లో ఆయన దక్షిణ భారతదేశాన్ని జయించాలి అనుకున్నాడు. అలాంటి టైంలో కూడా యేసుబాయి ఛత్రపతి రాజుకి పాలన, సైనిక ప్రణాళికలకు సంబంధించి ముఖ్యమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారట. అయితే ఒకానొక టైంలో శంభాజీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి శంబాజీ ఆగ్రాను విడిచి పెట్టి, తాను చనిపోయినట్టు పుకారును పుట్టించాడట. దీంతో శంభాజీ తన రాజ్యానికి సురక్షితంగా తిరిగి వచ్చేవరకు భర్త బ్రతికి ఉండగానే, ఆమె వితంతువుగా జీవించిందని చెప్పుకుంటారు. ఇటు శత్రువులు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులతో కూడా యేసుబాయి పోరాడాల్సి వచ్చింది. తన సొంత సోదరుడు ఘనోజితో రాజ్యం కోసం పోరాడింది.


Also Read: ఓటీటీలోకి దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్... తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


శంభాజీ హత్య 
ఇక శంభాజీ - యేసు బాయికి ఇద్దరు పిల్లలు భవాని భాయ్, సాహజి (షాహు). శంభాజీ తర్వాత మరాఠ సామ్రాజ్యాన్ని నడిపించే బాధ్యతను యేసు బాయి స్వీకరించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళపై యుద్ధాలు గెలవడమే కాకుండా భర్త మరణ దుఃఖాన్ని కూడా పక్కన పెట్టి, తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. 1689లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ ను మొఘలులు జైల్లో పెట్టి, అతన్ని అత్యంత దారుణంగా హింసించే వారట. చివరికి మార్చ్ 11న 1689న ఔరంగజేబు శంభాజీ మహారాజ్ ను ఉరి తీశాడు. 


27 ఏళ్లు జైల్లోనే... 
మహారాణి యేసు బాయి 1719 జూలై 4న మొఘల్ బంధిఖానా నుంచి 27 సంవత్సరాల తర్వాత విడుదలయ్యారట. ఈ సందర్భంగా యేసు బాయి రాకను గుర్తు చేసుకోవడానికి ఆ రోజును శౌర్య దివస్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. రాణి యేసుబాయి 1730లో మరణించింది. అయితే 1669లో శంభాజీ మహారాజ్ తో ఆమె వివాహం జరిగినప్పటి నుంచి 1730లో తాను మరణించే వరకు మరాఠా చరిత్రలో అల్లకల్లమైన కాలంలో ఆమె జీవించాల్సి వచ్చింది. 1674లో రాయఘడ్ లో శివాజీ రాజా పట్టాభిషేకం నుంచి మొదలు పెడితే, 1681 నుంచి 1707 వరకు మొఘలులపై జరిగిన కీలకమైన యుద్ధాలను, 1719 లో మరాఠా సైన్యాలు ఢిల్లీకి దండయాత్రను, బాజీరావులతో పాటు తన కుమారుడు షాహు పాలనను కూడా చూశారు. 1730లో యేసుబాయి నాయకత్వంలో జరిగిన వారణాసి ఒప్పందం మరాఠా సామ్రాజ్య ఐక్యతను కాపాడింది. సతారా నగరానికి సమీపంలో ఉన్న మహూలి అనే గ్రామంలో ఛత్రపతి శివాజీ రాజే భార్య మహారాణి యేసుబాయి  సమాధికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఆ ప్రదేశంలో ఒక రాతి బృందావనం ఉండేదని సమాచారం.


Also Read'ఛావా' రివ్యూ: నటుడిగా విక్కీ కౌశల్ సింహ గర్జన.. శివాజీ తనయుడు శంభాజీ సినిమా చూస్తే దేశభక్తులకు పూనకాలే, మరి ప్రేక్షకులకు? ఇందులో రష్మిక ఎలా చేసింది?