physical relationship Love: మధ్యప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని చెప్పి ఈ విడాకులు తీసుకున్నాడు. కోర్టు అతని భార్యకు నాలుగు వేల రూపాయల భరణం చెల్లించాలని ఆదేశించింది. అయితే తాను వార్డు బాయ్ గా పని చేస్తూ నెలకు ఎనిమిది వేలు మాత్రమే సంపాదిస్తున్నానని అందులో సగం తన భార్యకు ఇవ్వలేనని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా తన భార్య ఇతర వ్యక్తిని ప్రేమించిందని వాదించారు. హైకోర్టులో జరిగిన వాదనల్లో .. ఇతర వ్యక్తిని మరో వ్యక్తి భార్య శారీరక సంబంధం లేకుండా ప్రేమించడం అనేది వివాహేతర బంధం కిందకు రానే రాదని స్పష్టం చేసింది.  

తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని విడాకులు ఇచ్చిన భర్త              

శారీరక సంబంధం పెట్టుకోకుండా భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కిందకి రాదని తెలిపింది. పరాయి పురుషుడితో ఆమె శారీరకంగా కలిస్తేనే అక్రమ సంబంధం అవుతుందని పేర్కొంది.  తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందున ఆమెకు భరణం పొందే హక్కు లేదంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది.  భార్యకు నెలకు రూ.4 వేల భరణం చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.            

భరణం కూడా ఇవ్వనంటూ కోర్టులో పిటిషన్               

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) లోని సెక్షన్ 144(5) ,  క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 125(4) లను మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రస్తావించింది.  ఈ రెండూ భార్య  వివాహేతర బంధం పెట్టుకున్నట్లుగా రుజువు అయితేనే  ఆమెకు భరణం నిరాకరించవచ్చని  స్పష్టం చేస్తున్నాయి. శారీరక సంబంధానికి ఆధారాలు లేకుండా ఆరోపణను ధృవీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.   తన భార్య బ్యూటీ పార్లర్ నడుపుతూ ఆదాయం సంపాదిస్తున్నదనే భర్త వాదనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఆమె అలాంటి వ్యాపారం కోసం   దుకాణాన్ని కలిగి ఉందని లేదా అద్దెకు తీసుకుందని నిరూపించే ఎటువంటి డాక్యుమెంటరీ ఆధారాలను అందించడంలో అతను విఫలమయ్యాడని  స్పష్టం చేసింది.           

భరణం ఎగ్గొట్టేందుకు చేసిన ఆరోపణ            

శారరీక సంబంధాన్ని ఆ భర్త నిరూపించలేకపోయాడు. తన మాజీ భార్య వివాహ బంధంలో ఉన్నప్పుడు వేరే వ్యక్తిని ప్రేమించిందని మాత్రమే ఆరోపించగలిగాడు.  విడాకులు ఇచ్చినప్పుడు  కుటుంబ కోర్టు మధ్యంతర భరణం మంజూరు చేయడం ద్వారా ఎటువంటి భౌతిక చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడలేదని పేర్కొంటూ, భర్త పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.భర్త వాదనలో  వాదనలో ఎటువంటి అర్హత లేదని కోర్టు గుర్తించింది మరియు కుటుంబ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.             

Also Read : ఇండియా-యూఎస్‌ కలిపి పని చేయాలి - చైనాను ఎదుర్కొనే ప్లాన్‌ చెప్పిన ట్రంప్‌