బ్యాంక్‌ కస్టమర్లకు సూచన!! డిసెంబర్‌ ఆఖరి వారంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులకు ఆరు రోజులు సెలవులు వచ్చాయి. ఏవైనా ఆర్థిక అవసరాలు, పనులు ఉంటే సెలవులను గమనించి పూర్తి చేసుకోవడం మంచిది. 24 నుంచి వరుసగా సెలవులు ఉన్నాయి.


పండగల సీజన్లో అక్టోబర్, నవంబర్‌లో ఎక్కువ రోజులే బ్యాంకులకు సెలవులు వచ్చాయి. డిసెంబర్లో పండగలు లేకపోవడంతో సెలవులు తక్కువే! దేశ వ్యాప్తంగా బ్యాంకుల సెలవులను ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడు సెలవులు ఉన్నాయో జాబితా విడుదల చేస్తుంది. క్రిస్‌మస్ రోజు ఎలాగూ సెలవు ఉంటుంది. రెండ్రోజులు వీకెండ్‌ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సెలవులు ఉన్నాయి. అందుకే ప్లాన్‌ చేసుకొని ఆర్థిక లావాదేవీలు చేపట్టడం ముఖ్యం.


ఆర్‌బీఐ ప్రకారం, డిసెంబర్‌ 24 నుంచి సెలవులు ఇవే.


డిసెంబర్‌ 24: క్రిస్‌మస్‌ ఈవ్‌ సందర్భంగా ఐజ్వాల్‌, షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబర్‌ 25:  క్రిస్‌మస్ సందర్భంగా గువాహటి, హైదరాబాద్‌, ఇంఫాల్‌, జైపుర్‌, జమ్ము, కాన్పూర్‌, కోచి, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్‌, దిల్లీ, పనాజీ, పట్నా, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లా, శ్రీనగర్‌, తిరువనంతపురంలో సెలవు
డిసెంబర్‌ 27: క్రిస్‌మస్‌ వేడుకల సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు
డిసెంబర్‌ 30: ఉ కియాంగ్‌ నంగ్‌బా సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు
డిసెంబర్‌ 31: కొత్త ఏడాది ముందు రోజు సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు
డిసెంబర్‌ 25: నాలుగో శనివారం, క్రిస్‌మస్‌ సెలవు
డిసెంబర్‌ 26: ఆదివారం


Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!


Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్‌


Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ విలువ.. మిగతావీ??


Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్‌ లిస్టింగ్‌ సూపర్‌హిట్‌.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?


Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు


Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.