Top Affordable Cars in Indian Market: ప్రతి ఒక్కరూ వీలైనంత తక్కువ ధరలో మంచి కారును పొందాలని కోరుకుంటారు. భారతీయ మార్కెట్లో మీ కోసం ఇటువంటి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రూ.ఐదు లక్షల లోపు ధర ఉండే అలాంటి కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో అత్యంత చవకైన కార్లు ఏవో తెలుసుకుందాం.


మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)
ఈ లిస్టులో మొదటి కారు మారుతి సుజుకి ఆల్టో కే10. ఇది అత్యధికంగా అమ్ముడైన కారు. కంపెనీ ఆల్టో కే10లో 1.0 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఆప్షన్లల్ 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీంతో పాటు ఆల్టో కే10 సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది ఐడిల్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.3.99 లక్షలుగా ఉంది.


మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
రెండో కారు మారుతి సుజుకి సెలెరియో. ఇది చవకైన కార్లలో గొప్ప ఆప్షన్. సెలెరియోలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 67 పీఎస్ పవర్‌ని, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సెలెరియో ప్రారంభ ధర రూ.5.36 లక్షలుగా ఉంది. ఇది ఇండియన్ మార్కెట్లో మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


టాటా టియాగో (Tata Tiago)
ఈ లిస్టులో మూడో కారు టాటా టియాగో. ఈ కారు మీ బడ్జెట్ విభాగంలో ఖచ్చితంగా సరిపోతుంది. ఈ టాటా కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇంజన్ గరిష్టంగా 86 బీహెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మీరు టియాగోలో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను కూడా పొందుతారు. భారతీయ మార్కెట్లో మీరు టాటా టియాగోను రూ. 4.99 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.


మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
మీ బడ్జెట్‌కు సరిపోయే నాలుగో కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో. ఈ కారు కంపెనీ అందిస్తున్న చవకైన కార్లలో ఒకటి. దీని ఎక్స్- షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఎస్-ప్రెస్సో... ఆల్టో కే10లో ఉన్న ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ కారు బేస్ వేరియంట్ రూ. ఐదు లక్షల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఎస్-ప్రెస్సో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ కారు 68 పీఎస్ పవర్, 90 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!