Rolls Royce Ghost Series II Price: రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II రిఫ్రెష్డ్ మోడల్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ కారు విడుదలైన రెండు నెలల తర్వాత లగ్జరీ సెడాన్ చిన్న మోడల్ కూడా భారత మార్కెట్లోకి వచ్చింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్... స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్, బ్లాక్ బ్యాడ్జ్ అనే మూడు వేరియంట్‌లలో మార్కెట్లోకి వచ్చింది.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్ లిఫ్ట్ ధర
రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్ లిఫ్ట్ స్టాండర్డ్ మోడల్ ధర రూ.8.95 కోట్లుగా ఉంది. దీని ఎక్స్‌టెండెడ్ వేరియంట్ ధర రూ. 10.19 కోట్లు కాగా, బ్లాక్ బ్యాడ్జ్ వేరియంట్ ధర రూ. 10.52 కోట్లుగా ఉంది. ఈ రోల్స్ రాయిస్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం కారు కంపెనీ బుకింగ్స్ తీసుకోవడం కూడా ప్రారంభించింది. 2025 మొదటి నాలుగు నెలల్లో కంపెనీ ఈ కారును డెలివరీ చేయగలదు.
Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి మార్పులు జరిగాయి?
రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్ బ్లాక్ డిజైన్‌తో లాంచ్ అయింది. ఇదే విధమైన డిజైన్ సిరీస్ II కుల్లినన్‌లో కూడా కనిపిస్తుంది. ముందు బంపర్ క్రింద ఒక చిన్న గ్రిల్ అందించారు. డీఆర్ఎల్స్ దాని చుట్టూ వైపులా ఉన్నాయి. ఈ వాహనం వెనుక డిజైన్ గురించి చెప్పాలంటే టెయిల్‌లైట్‌లతో కొత్త లుక్ అందించారు. ఈ వాహనంలో రెండు రకాల 22 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ది రోల్స్ రాయిస్ ఘోస్ట్ పవర్ ఎంత?
రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్ కొత్త మోడల్‌లో వాహన తయారీదారులు ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటి మోడల్ లాగానే ఈ వాహనం 6.75 లీటర్ ట్విన్ టర్బో వీ12 ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చిది ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు కూడా కనెక్ట్ అయింది. ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్ స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌లలో ఇన్‌స్టాల్ చేసిన ఇంజన్ 563 హెచ్‌పీ పవర్‌ని, 850 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అదే సమయంలో బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్‌లోని అదే ఇంజన్ 592 బీహెచ్‌పీ పవర్. 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?