Fast charging Technology: కేవలం 10 నిమిషాల్లోనే ఈవీ కారు ఛార్జింగ్.. సరికొత్త టెక్నాలజీ కనిపెట్టిన ఇండియన్ సైంటిస్ట్

Fast charging Technology: భారత సంతతికి చెందిన పరిశోధకుడు అంకుర్ గుప్తా కొత్త ఛార్జింగ్ టెక్నాలజీని కనుగొన్నారు. ఈ టెక్నాలనీతో ఎలక్ట్రిక్ కారును కేవలం 10 నిమిషాల్లోనే పూర్తిగా ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.

Continues below advertisement

Fast charging Technology: ఈ మధ్యకాలంలో మనదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్ల దే హవా నడుస్తోంది. పెద్దెత్తున మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్ విడుదల అవుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ఖర్చులను ఆదా చేయడంతోపాటు పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని చాలా మందిని వీటిని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జ్  చేసేందుకు చాలా సమయం పడుతోంది. దీంతో దూర ప్రయాణాలు చేసేవారు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఫోన్లు, ల్యాప్ టాప్స్ కోసం ఫాస్ట్ ఛార్జర్లు ఇప్పటికే ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ఈ వాహనాలు స్లో ఛార్జింగ్ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్రాలు చేస్తున్నారు. 

Continues below advertisement

ఈ క్రమంలోనే భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్త అంకుర్ గుప్తా అలాంటి సాంకేతికతను కనిపెట్టాడు. ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే.. ఎలక్ట్రిక్ కారును కేవలం 10 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చు. ఫోన్, ల్యాప్ టాప్‌ను కూడా ఒక నిమిషంలోనే ఛార్జింగ్ చేయవచ్చు. అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు అంకుర్ గుప్తా అతని టీమ్ ఈ సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. వారి అధ్యయనాన్ని ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.

కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త బ్యాటరీ టెక్నాలజీతో బ్యాటరీలను చాలా వేగంగా ఛార్జ్ చేయడమే కాకుండా ఎక్కువ సేపు శక్తిని సపోర్టు చేస్తుంది. ఈ టెక్నాలజీ సూపర్ కెపాసిటర్ల డెవలప్ కు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవి సాధారణ బ్యాటరీల కంటే మెరుగ్గా ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కనిపెట్టేందుకు టైనీ ఛార్జ్డ్ సెల్స్ (అయాన్లు) పనితీరును పరిశీలించారు.

న్యూ బ్యాటరీ టెక్నాలజీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ డివైజుల్లో ఎనర్జీని స్టోర్ చేయడానికి మాత్రమే కాదు.. పవర్  గ్రిడ్స్ కు కూడా పనిచేస్తుందని గుప్తా తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎనర్జీని అందించేందుకు తక్కువ డిమాండ్ ఉన్న సమయాల్లో వేస్ట్ కాకుండా సమర్థవంతంగా స్టోర్ చేయడానికి ఈ లేటెస్టు టెక్నాలజీ అవసరమన్నారు. సూపర్ కెపాసిటర్లు అనేవి ఒక రకమైన బ్యాటరీ. ఇవి ఎనర్జీని స్టోర్ చేసేందుకు రంధ్రాల్లో ఐయాన్లను సేకరిస్తాయి. సాంప్రదాయ బ్యాటరీలతో పోల్చితే సూపర్ కెపాసిటర్లు చాలా వేగంగా ఛార్జ్ అవుతాయని.. ఎక్కువసేపు పనిచేస్తాయని గుప్తా పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉంది. భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. పర్యావరణానికి సైతం మేలు జరుగుతుంది.

Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?

Continues below advertisement