Thar Roxx Bank Loan And EMI Details: డ్రైవింగ్‌ చేయడమే కాదు, దానిని ఎంజాయ్‌ చేయడం కూడా ఒక కళ. చాలా మంది, లాంగ్‌ డ్రైవ్‌లతో థ్రిల్‌ ఫీలవుతారు & రీఛార్జ్‌ అవుతారు. మహీంద్ర & మహీంద్ర బ్రాండ్‌ లాంచ్‌ చేసిన థార్ రాక్స్‌ కూడా అలాంటి గొప్ప అనుభూతిని అందించే ఆఫ్-రోడింగ్ SUV. ముఖ్యంగా, యువత ఈ బండంటే వెర్రెత్తిపోతోంది. గత సంవత్సరం, మహీంద్ర కొత్త 5-డోర్ల థార్‌ రాక్స్‌ను మార్కెట్‌లోకి వదిలింది. మునుపటి కంటే మరింత పవర్‌తో, మరింత ఆకర్షణీయంగా దానిని డిజైన్‌ చేసింది.

మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ధర కాస్త ఎక్కువే. దీనిని సొంతం చేసుకోవాలనే కోరిక ఉన్నా, రేటును చూసి సగటు మనిషి భయపడుతున్నాడు. మీకు కూడా ఈ బండిపై మోజు ఉండి, తక్కువ బడ్జెట్ కారణంగా కొనలేకపోతున్నారా?. అయితే, సరైన ఫైనాన్స్ ప్లాన్ ఉంటే, మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్‌ ఆఫ్-రోడింగ్ SUVని తీసుకెళ్లి మీ ఇంటి ముందు పార్క్‌ చేసుకోవచ్చు. ఈ SUVని కొనడాని ఎలాంటి ప్లాన్‌ ఉండాలో ఇప్పుడు చూద్దాం.

మహీంద్రా థార్ రాక్స్ డౌన్ పేమెంట్ & లోన్‌దిల్లీలో, మహీంద్రా థార్ రాక్స్ బేస్ వేరియంట్ MX 1 రియర్ వీల్ డ్రైవ్ (పెట్రోల్) మోడల్ ఆన్ రోడ్ ప్రైస్‌ దాదాపు 15 లక్షల 40 వేల రూపాయలు. మీ దగ్గర ఇప్పుడు రూ.2 లక్షలు ఉంటే చాలు. ఈ SUV ని కొనడానికి ఆ రూ. 2 లక్షలను డౌన్ పేమెంట్ చేసేయండి, మిగిలిన 13 లక్షల 40 వేల రూపాయలను బ్యాంక్‌ నుంచి కార్‌ లోన్‌గా తీసుకోండి. బ్యాంక్‌ మీకు 9 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్‌ మంజూరు చేసిందని భావిద్దాం. మీ జీతం లేదా నెలవారీ ఆదాయం కనీసం రూ. 50 వేల నుంచి 60 వేలు ఉంటే, కార్‌ లోన్‌ EMI చెల్లించడం మీకు సులభం అవుతుంది. 

మహీంద్రా థార్ రాక్స్ లోన్‌ EMI లెక్కలు (9 శాతం వడ్డీ రేటు)

  • 5 సంవత్సరాల కాలానికి రూ.13.4 లక్షల రుణం తీసుకుంటే, మీ నెలవారీ EMI రూ. 27,816 అవుతుంది. ఐదేళ్ల కాలంలో (60 నెలలు) కట్టే మొత్తం వడ్డీ రూ. 3,28,972 తో కలిపి మొత్తం రూ. 16,68,972 బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి.
  • 6 సంవత్సరాల కాలానికి అదే మొత్తం లోన్‌ తీసుకుంటే, EMI రూపంలో ప్రతి నెలా రూ. 24,154 చెల్లించాలి. ఆరేళ్ల (72 నెలలు) కాలంలో కట్టే మొత్తం వడ్డీ రూ. 3,99,104 తో కలిపి మొత్తం రూ. 17,39,104 రీపేమెంట్‌ చేయాలి. 
  • 7 సంవత్సరాల కాలానికి రూ.13.4 లక్షల రుణం తీసుకుంటే, మంత్లీ EMI రూ. 21,559 అవుతుంది. ఏడేళ్ల (84 నెలలు) కాలంలో కట్టే మొత్తం వడ్డీ రూ. 4,70,987 తో కలిపి మొత్తం రూ. 18,10,987 బ్యాంక్‌కు తిరిగి చెల్లించాలి.
  • మీకు స్థోమత ఉండి 4 సంవత్సరాలలోనే లోన్‌ తీర్చేలా ప్లాన్‌ చేసుకుంటే, రూ.13.4 లక్షల లోన్‌పై 9 శాతం వడ్డీ చొప్పున, నెలకు రూ. 33,346 EMI చెల్లించాలి. ఈ 48 నెలల్లో 2,60,606 వడ్డీతో కలిపి మొత్తం రూ. 16,00,606 చెల్లించాలి.

మహీంద్రా థార్ రాక్స్‌ మైలేజీకంపెనీ చెప్పిన ప్రకారం, మహీంద్రా థార్ రాక్స్ దాదాపు 15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. కాబట్టి, మీరు ఇంధనం కోసం కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఖర్చు మీ మొత్తం వ్యయాన్ని పెంచుతుంది. కాబట్టి, ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. 

మహీంద్రా థార్ రాక్స్ డిజైన్ & ఫీచర్లుమహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ SUV రెండు శక్తిమంతమైన ఇంజన్‌ ఆప్షన్లతో వచ్చింది, అవి... 2.0-లీటర్ 4-సిలిండర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజిన్ & 2-లీటర్ 4-సిలిండర్ mHawk డీజిల్ ఇంజిన్. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆపన్స్‌ కూడా దీనిలో ఉన్నాయి.

మహీంద్రా థార్ రాక్స్ కలర్‌ ఆప్షన్స్‌కొత్త మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్‌ SUV టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ & నెబ్యులా బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగులలో లాంచ్‌ అయింది. ఇది 3-డోర్‌ 'థార్' కంటే కొంచెం పొడవుగా ఉంది & ఈ బండిలో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.