Best Budget 7-Seater MPVs For Big Family: మన దేశంలో చాలామంది పెద్ద & ఉమ్మడి కుటుంబాల్లో జీవిస్తున్నారు, ఆ కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య ఎక్కువ. అలాంటి పెద్ద కుటుంబాలకు సాధారణ చిన్న కారు సరిపోదు. వాళ్లందరికీ ఒక కారు తక్కువ - రెండు కార్లు ఎక్కువ అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అలాంటి పెద్ద లేదా ఉమ్మడి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని దాదాపు అన్ని కంపెనీలు పెద్ద కార్లను/ MPVలను (Multi-purpose vehicles) లాంచ్ చేశాయి. ఇవి ఎక్కువ స్థలంతో వస్తాయి. పెద్ద కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడానికి, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్ వేయడానికి ఈ మల్టీ పర్పస్ వెహికల్స్ (Best MPVs 2025) సరిగ్గా సరిపోతాయి.
మీకు కూడా పెద్ద కుటుంబం ఉండి, మీ కుటుంబ సభ్యులందరికీ సులభంగా సరిపోయే కారు కోసం సెర్చ్ చేస్తుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. 7 సీట్ల కార్ల గురించి ఈ వార్తలో చెబుతాం, మీరు సెర్చ్ చేసే పనిని తగ్గిస్తాం. ఈ కార్లు మీ బడ్జెట్‌లో ఉండడమే కాదు, ఎక్కువ బూట్ స్పేస్‌తో, ముచ్చగొలిపే ఫీచర్లతో మిమ్మల్ని కట్టిపడేస్తాయి.
రెనాల్ట్ ట్రైబర్ఈ లిస్ట్‌లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఆప్షన్ రెనాల్ట్ ట్రైబర్ MPV. ఇది భారత మార్కెట్లో అత్యంత చవకైన MPVగా నిలిచింది. ఈ రెనాల్ట్ కారులో, 1 లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. కారులో కూర్చున్నవాళ్లను ఖుషీ చేసే గొప్ప ఫీచర్లతో పాటు కట్టుదిట్టమైన భద్రత లక్షణాలు ఈ కారు సొంతం. రెనాల్ట్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర (Renault Triber Ex-showroom price) రూ. 6.09 లక్షలు. ఇందులో టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.97 లక్షల వరకు ఉంటుంది.
మారుతి సుజుకి ఎర్టిగాలిస్ట్‌లో రెండో పేరు మారుతి ఎర్టిగా. ఇది MPV సెగ్మెంట్‌లో బాగా అమ్ముడవుతోంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ & CNG ఇంజిన్ ఆప్షన్స్‌తో ఈ కార్ లాంచ్ అయింది. ఈ మారుతి కారు ఈ విభాగంలో చాలా మందికి నచ్చింది, రోడ్డు మీదే కాదు అమ్మకాల్లోనూ దమ్ము చూపుతోంది. మారుతి ఎర్టిగా ఎక్స్-షోరూమ్ ధర (Maruti Suzuki Ertiga Ex-showroom price) రూ. 8.96 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది & దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.25 లక్షలు.
టయోటా రూమియన్మూడో పేరు టయోటా రూమియన్, MPV సెగ్మెంట్‌లో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఈ టయోటా కారులో 1.5 లీటర్ కెపాసిటి గల నేచురల్లీ ఆస్పిరేటెడ్ CNG ఇంజిన్‌ను అమర్చారు. టయోటా రూమియన్ ఎక్స్-షోరూమ్ ధర (Toyota Rumion Ex-showroom price) రూ. 10.54 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది & టాప్ వేరియండ్ ప్రైస్ రూ. 13.83 లక్షల వరకు ఉంటుంది.
కియా కారెన్స్ పెద్ద ఫ్యామిలీలకు కార్ అందించే రేస్‌లో కియా కూడా ఉంది, కియా కారెన్స్‌ను కూడా మీరు ఓసారి ట్రైయల్ వేసి చూడవచ్చు. ఈ కియా కారులో 1.5 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ లేదా డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను అందించారు. కియా కారెన్స్ ఎక్స్-షోరూమ్ ధర (Kia Carens Ex-showroom price) రూ. 10 లక్షల నుంచి స్టార్ అవుతుంది, రూ. 19.49 లక్షల వరకు ఉంటుంది.