Easter Celebrations 2025 : క్రైస్తవ మతంలో ఈస్టర్ అనేది అత్యంత ముఖ్యమైన పండుగ. గుడ్​ ఫ్రైడే రోజు చనిపోయిన ఏసు క్రీస్తు పునరుత్థానాన్ని ఇది సూచిస్తుంది. పాపులను రక్షించుటకు గుడ్​ ఫ్రైడే (శుక్రవారం) రోజు శిలువపై మరణించిన జీసస్ ఆదివారం రోజున తిరిగి లేచినట్లు బైబిల్​లో ఉంది. దానిని క్రైస్తవులు ఈస్టర్​గా జరుపుకుంటున్నారు. ఈ పండుగ ప్రతి ఏడాది వస్తుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ తేదీ మారుతూ ఉంటుంది. ఈ స్పెషల్ డే గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూసేద్దాం. 

ఈస్టర్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు

ఈస్టర్​ లెంట్​ డేస్​లో చివరి రోజును సూచిస్తుంది. ఇప్పటివరకు జరిగిన శ్రమ దినాలకు ఈ స్పెషల్ డే చెక్ పెడుతుంది. ఏసు తిరిగిలేచాడనే సంతోషంతో ప్రజలు సంబరాలు చేసుకుంటారు. కొత్త దుస్తులు ధరించి.. చర్చిలకు వెళ్తారు. పాటలు, ప్రార్థనలతో జీసస్​ను స్తుత్తించి.. నచ్చిన విందు ఆరగిస్తారు. శ్రమలకాలల్లో ఉపవాసమున్నవారు.. నాన్​ వెజ్ తినని వారు ఈస్టర్​ రోజు నచ్చిన భోజనం తీసుకుంటారు. 

ఈస్టర్ అనే పదం ఈస్త్రే (Eostre) అనే పదం నుంచి వచ్చింది. అలాగే మూన్ క్యాలెంటర్​ ప్రకారం.. ఈస్టర్​ తేదీని గుర్తిస్తారు. దీని ప్రకారం చూసుకుంటే.. ఈస్టర్ అనేది మార్చి 22 నుంచి ఏప్రిల్ 25 మధ్య తేదీల్లో ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే ప్రతి సంవత్సరం దీని తేది మారుతుంది. 

ఈస్టర్​కి, ఎగ్​కి రిలేషన్ ఇదే.. 

ఈస్టర్ సమయంలో ఎగ్స్​కి రంగులు పూసి ప్రాముఖ్యతలు ఇస్తారు. ఎందుకంటే లెంట్​ డేస్​లో 40 రోజులు ఉపవాసముంటారు. ఆ సమయంలో ఎగ్స్ తినరు. కాబట్టి ఈస్టర్​ రోజు ఎగ్స్ తినడం ప్రత్యేకంగా మారింది. అలాగే జర్మన్ ప్రజలు ఈస్టర్​ గురించి ఓ కథ చెప్తారు. దాని ప్రకారం.. ఓస్టర్​హెస్ (Osterhase) అనే ఓ కోడి రంగురంగుల గుడ్లు పెట్టేదట. దానిని ఈస్టర్​ బన్నీ అని ముద్దుగా పిలుచుకునేవారు. 

చాక్లెట్ ఎగ్స్..

ఫ్రాన్స్, జర్మనీ దేశాలు 19వ శతాబ్ధంలో ఈస్టర్ ఎగ్స్​ని చాక్లెట్స్​తో చేయడం ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ సమయంలో ఈ చాక్లెట్ ఎగ్ కల్చర్ బాగా ఫేమస్ అయింది. ఇటలీలో 2011లో చాక్లెట్​తో 34 అడుగుల అతిపెద్ద ఈస్టర్ ఎగ్​ని రెడీ చేశారు. దాని బరువు 7200 కిలోల కంటే ఎక్కువ. 

ఎగ్ రోలింగ్ ఈవెంట్.. 

అమెరికాలో 1878లో అప్పటి అధ్యక్షుడు రదర్​ఫోర్డ్ హేస్ ఈస్టర్ ఎగ్ రోలింగ్ ఈవెంట్​ని ప్రారంభించాడు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. 

ఏ దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే.. 

ఇండియాలో ఈస్టర్ సంబరాలను చర్చిల్లో జరుపుకుంటారు. కొత్త బట్టలు వేసుకుని.. చర్చికి వెళ్తారు. ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుకుంటూ, సువార్త వింటారు. నచ్చిన భోజనం చేసుకుని.. సంతోషంగా ఫ్రెండ్స్, ఫ్యామిలతో గడుపుతారు. అయితే వివిధ దేశాల్లో ఈస్టర్​ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. 

అమెరికాలో చాక్లెట్ ఎగ్స్, ఈస్టర్ బన్నీ తీసుకుంటారు. వైట్ హౌస్​లో ఈస్టర్ ఎగ్ రోల్ చేస్తారు. ఫ్రాన్స్​లో అయితే ఈస్టర్ ఎగ్స్ గిఫ్ట్స్​గా ఇచ్చుకుంటారు. ఇటలీలో ఈస్టర్​ను పస్క్వా (Pasqua) అంటారు. మతపరమైన ఉత్సవాలు, ఊరేగింపులు చేస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కోలంబా అనే స్వీట్​ బ్రెడ్​ను ఈస్టర్​ రోజు ఎక్కువగా తీసుకుంటారు. రోమ్​లోని వాటికన్ సిటీలో పోప్​ ప్రసంగం పెద్ద ఈవెంట్​గా జరుగుతుంది. 

స్పెయిన్​లో ఊరేగింపులు చేస్తూ.. వేడుకలు జరుపుకుంటారు. ఇంగ్లాండ్​లో చాక్లెట్ ఎగ్స్, ఈస్టర్ హంట్స్, హాట్ క్రాస్ బన్స్ కచ్చితంగా ఉంటాయి. పిల్లలతో ఎగ్ రోలింగ్ గేమ్స్ ఆడిస్తారు. ఆస్ట్రేలియాలో ఈస్టర్ సమయంలో చాక్లెట్ బిల్బీలు ఎక్కువగా తీసుకుంటారు. పిల్లలతో ఈస్టర్ ఎగ్ హంట్స్ గేమ్ ఆడిస్తారు.