Citroen C3 and C3 Aircross: సిట్రోయెన్ ఇండియా ఇటీవల భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. ఇప్పుడు కంపెనీ తన కార్లలో మహేంద్ర సింగ్ ధోని ఎడిషన్‌ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ కార్లకు మహేంద్ర సింగ్ ధోనీని కనెక్ట్ చేసే అంశాలను కంపెనీ యాడ్ చేసే అవకాశం ఉంది. సిట్రోయెన్ తన సీ3, సీ3 ఎయిర్‌క్రాస్ మోడల్‌లలో మహేంద్ర సింగ్ ధోని ఎడిషన్‌ను విడుదల చేస్తుంది.


ధోనీ స్పెషల్ ఎడిషన్ కంపెనీ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్తుందని, దాని బ్రాండ్ అంబాసిడర్‌తో పాటు, సిట్రోయెన్ కస్టమర్‌లు కూడా ప్రత్యేకమైన, గొప్ప ఆప్షన్‌ను పొందుతారని సిట్రోయెన్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ను (T20 Worldcup 2024) దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థ ధోని ప్రజాదరణను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది.


సిట్రోయెన్ ఇండియా మహేంద్ర సింగ్ ధోనీ సహకారంతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం పేరు - 'డూ వాట్ మేటర్స్'. దీని కింద టీ20 ప్రపంచ కప్ కోసం భారత క్రికెట్ జట్టుకు మద్దతుగా క్రికెటర్లు, వారి అభిమానులను ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు. భారత క్రికెట్ జట్టుకు సపోర్ట్‌గా సిట్రోయెన్ 'టీమ్ ధోనీ' 26 నగరాల్లో పర్యటించనుంది.


Also Read: కొత్త పల్సర్ విడుదల చేసిన బజాజ్ - లేటెస్ట్ ఫీచర్లు, రేటు ఎంతో తెలుసా?


సిట్రోయెన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా మాట్లాడుతూ "క్రికెట్ భారతదేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. మా బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ ధోనీతో మా ప్రమోషనల్ మెసేజ్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయగలమని విశ్వసిస్తున్నాం. ఈ ప్రచారం ఏమిటంటే ప్రజలు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా వాహనాలను పొందాలని, సిట్రోయెన్ ఈ పారదర్శకత, విశ్వసనీయత, శ్రేష్ఠతపై పని చేస్తోంది."


ఎంఎస్ ధోని ఎడిషన్‌లో శక్తివంతమైన ఇంజన్
సీ3, సీ3 ఎయిర్‌క్రాస్‌ల్లో కంపెనీ ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. రెండు వాహనాలు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. సీ3 హ్యాచ్‌బ్యాక్ లో ఎండ్ వేరియంట్‌లో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ మోటార్ కూడా ఉంది. సీ3, సీ3 ఎయిర్‌క్రాస్ రెండూ 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. దీంతో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆటో కార్ ప్లే ఫీచర్ కూడా అందించబడింది.


ఈ రెండు సిట్రోయెన్ కార్లు కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ చేయగల ఓఆర్వీఎంలు, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ, ఈఎస్పీ, రేర్ వ్యూ కెమెరాతో కూడిన ఏబీఎస్‌లను కలిగి ఉంటాయి. 






Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?