Top Scooters Under Rs 1 Lakh: ఆర్థిక భారం కాని & మంచి మైలేజీ ఇచ్చే స్కూటర్లు భారతీయ మార్కెట్లో చాలా ఉన్నాయి. మీరు లక్ష రూపాయల బడ్జెట్‌లో మంచి స్కూటర్ కొనాలని భావిస్తుంటే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. రూ. 1 లక్ష రేంజ్‌లో ఉన్న చూడచక్కటి స్కూటర్లు భారతీయ రోడ్ల మీద ఇప్పటికే పరుగులు తీసుకున్నాయి. ఫీచర్లు, మైలేజ్, విశ్వసనీయత పరంగా అవి ఎక్కువ మందికి నచ్చాయి.
హోండా యాక్టివా 6జీ హోండా యాక్టివా 6G ఆన్ రోడ్ ధర (Honda Activa 6G On-road Price) రూ. 92,181 నుంచి రూ. 98,731 మధ్య ఉంటుంది. ఈ టూవీలర్‌లో 109.51cc ఇంజిన్ అమర్చారు, ఇది లీటరుకు 59.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ 110cc స్కూటర్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ. హోండా యాక్టివా భారత మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన & అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. దీని బిల్డ్ క్వాలిటీ & లో మెయిట్‌నెన్స్ దీనిని ఒక పరిపూర్ణ కుటుంబ స్కూటర్ అని అనిరూపించాయి.
టీవీఎస్ జూపిటర్ TVS జూపిటర్ ఆన్ రోడ్ ధర (TVS Jupiter On-road Price) రూ. 88,561 నుంచి ప్రారంభమై రూ. 1.06 లక్షల వరకు ఉంటుంది. ఇది 113.3cc ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. లీటర్ పెట్రోల్ పోస్తే 48 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్నది కంపెనీ మాట. ఈ బండి గరిష్ట వేగం గంటకు 82 కి.మీ. టీవీఎస్ జూపిటర్ రోడ్డుపై బలమైన గ్రిప్ సాధిస్తుంది & వేగంలోనూ మృదుత్వాన్ని ప్రదర్శిస్తుంది. అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్‌కు ఇది ప్రసిద్ధి చెందింది. రోజువారీ రైడింగ్‌కు అనువైన స్కూటర్ టీవీఎస్ జూపిటర్.
సుజుకి యాక్సెస్సుజుకి యాక్సెస్ 125 ఆన్ రోడ్ ధర (Suzuki Access On-road Price)దాదాపు లక్ష రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. 124cc ఇంజిన్‌తో పని చేసే ఈ స్కూటర్ 8.42 PS పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. లీటర్ పెట్రోల్‌తో ఈ బండి 45 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదని కంపెనీ తెలిపింది. కొంచెం ఎక్కువ పవర్, గొప్ప డిజైన్ & మెరుగైన పనితీరు కోరుకునే కస్టమర్లకు ఈ స్కూటర్ సరైనది.
యమహా ఫాసినో 125 యమహా ఫాసినో 125 FI హైబ్రిడ్ ఆన్ రోడ్ ధర (Yamaha Fascino 125 On-road Price) రూ. 99,969 నుంచి స్టార్ అవుతుంది. ఈ బండికి 125cc ఇంజిన్ జత చేశారు, ఇది లీటర్‌కు 68.75 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంది. బండి గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన దీని స్టైలిష్ డిజైన్ & అద్భుతమైన మైలేజ్ ఈ స్కూటర్‌ను ఒక తెలివైన ఎంపికగా మార్చాయి.
టెస్ట్ డ్రైవింగ్‌మీరు రూ.లక్ష బడ్జెట్‌లో బండి కొనాలని డిసైడ్ అయితే, మేం చెప్పిన వివరాలను గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు, టైమ్ వేస్ట్ అనుకోకుండా అన్ని షోరూమ్‌లకు వెళ్లండి. అన్ని చోట్లా టెస్ట్ డ్రైవింగ్ స్కూటర్లు అందుబాటులో ఉంటాయి. టెస్ట్ డ్రైవింగ్ సమయంలో మీ ఎత్తును, సీటింగ్ కంఫర్ట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బూట్ స్పేస్ కూడా చూడండి. టెస్ట్ డ్రైవింగ్ తర్వాత, ఆ అనుభవాన్ని మిగిలిన స్కూటర్లతో పోల్చి చూసి, సరైన స్కూటర్ ఎంచుకోండి.