హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. భారతీయ మార్కెట్లో కొత్త CB200X బైక్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ధర రూ. 1.44 లక్షలు. ఈ కొత్త బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ బైక్ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్ లేదా అధికారిక డీలర్ షిప్ ద్వారా 2,000 రూపాయల టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. రోజువారీ అవసరాలతో పాటు ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌కు అనుగుణంగా ఈ బైక్‌ను హోండా తీర్చిదిద్దారు.


Also read: Ram Charan Movie: ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!


                  NET టీజర్: అవికా గోర్ గదిలో సీక్రెట్ కెమెరా పెట్టి.. రాహుల్ రామకృష్ణ పాడుపని


బీఎస్‌-6 ప్రమాణాలతో 184 సీసీ ఇంజిన్‌తో CB200X బైక్‌ వస్తోంది. 8,500 ఆర్‌పీఎం వద్ద 17 బీహెచ్‌పీని, 6000 ఆర్‌పీఎం వద్ద 16.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను దీనికి అమర్చారు. గతంలో వచ్చిన హార్నెట్‌ 2.0లోనూ ఇదే ఇంజిన్‌ ఉంది. CB200Xలో ఎల్‌ఈడీ లైట్‌ సెటప్‌, పూర్తి డిజిటల్‌ లిక్విడ్‌ క్రిస్టల్‌ మీటర్‌, స్ప్లిట్‌ సీట్‌, సింగిల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, ఫ్రంట్, బ్యాక్  డిస్క్‌ బ్రేకులను అందించారు. ఈ బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి డెలివరీలు మొదలు కానున్నాయని కంపెనీ డైరెక్టర్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా ప్రకటించారు.


Also Read: Honda Amaze Facelift: హోండా నుంచి అమేజ్ ఫేస్‌లిఫ్ట్.. ధర ఎంతంటే?


Tata Tigor EV: టాటా నుంచి సూపర్ ఫీచర్స్‌తో మరో ఎలక్ట్రిక్‌ కారు.. అమ్మకాలు ఎప్పటి నుంచి అంటే..


Honda CB200X బైక్‌కు ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఇందులోని విండ్‌స్క్రీన్ సాధారణంగా అడ్వెంచర్ బైక్‌లలో కనిపించే దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ బైక్ మైలేజీని మెరుగుపరచడానికి 8 ఆన్-బోర్డ్ సెన్సార్‌లతో పాటు ఈ బైక్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టం కూడా అందుబాటులో ఉంది.  సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో అప్‌ సైడ్ డౌన్ పోర్క్, వెనక భాగంలో మోనోషాక్ సెటప్ ఉంటుంది.


Also Read: Volkswagen Taigun: సెప్టెంబర్‌లో వోక్స్ వేగన్ టైగన్ ఎస్‌యూవీ.. ప్రారంభమైన ప్రీ బుకింగ్స్


Simple One Scooter: ఓలాకు పోటీగా 'సింపుల్' స్కూటర్.. ఒకసారి చార్జింగ్‌తో 236 కిలోమీటర్లు..