వోక్స్ వేగన్ టైగన్ ఎస్‌యూవీ కారు భారత మార్కెట్లోకి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ కారు ఉత్పత్తి గురించి సంస్థ కీలక ప్రకటన చేసింది. టైగన్ ఎస్‌యూవీ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. టైగన్ కార్ల కోసం ప్రీ బుకింగ్‌లను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. వీటిని సెప్టెంబర్ నుంచి డెలివరీ చేస్తామని వెల్లడించింది. వోక్స్ వేగన్ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌తో పాటు రిటైల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వీటిని బుక్ చేసుకోవచ్చని చెప్పింది. ప్రీ బుకింగ్ కింద కనీసం రూ.25000 చెల్లించాలని తెలిపింది. 





టైగన్ ఎస్‌యూవీ టీఎస్ఐ టెక్నాలజీతో రానుంది. 1.0 లీటర్, 1.5 లీటర్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. వైల్డ్ చెర్రీ రెడ్, కర్కుమా ఎల్లో, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ గ్రే కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ వంటి కార్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. పొలెన్ కంట్రోల్‌తో స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసీ సదుపాయం ఉంది. 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ ఉంటుంది.






టైగన్ ఎస్‌యూవీ.. MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌తో ఏర్పడుతుంది. వైర్‌లెస్ యాప్ కనెక్టివిటీ, వైర్‌లైస్ మొబైల్ చార్జింగ్ సదుపాయాలు ఉన్నాయి. డ్యుయల్ టోన్ ప్రీమియం ఇంటీరియర్లతో రానుంది. 7 స్పీడ్ డీఎస్‌జీ ట్రాన్స్ మిషన్, 6 స్పీడ్ ఆటోమెటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. మనీలా ఎల్లోయ్ వీల్స్ ఉంటాయి.


Also read: Vehicle Scrappage Policy: మీ కారు రోడ్డెక్కుతుందా.. జాగ్రత్త.. చెక్ చేసుకోకుంటే చెత్తలోకే..


చిన్నారుల కోసం ISOFIX సీట్ మౌంట్ ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలలో జారిపోకుండా ఉండేందుకు హిల్ హోల్డ్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగులను అందించారు. కాగా, టైగన్ ఎస్‌యూవీ ధర రూ.10.5 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్యలో (ఎక్స్ షోరూం ధరల ప్రకారం) ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.