Car Sales Report November 2023: ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది కొత్త కార్లను కొనేవారు ఎస్‌యూవీలను ఇష్టపడటం ప్రారంభించారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు హ్యాచ్‌బ్యాక్ కార్లు దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. అవే అత్యంత ప్రజాదరణ పొందిన కార్లుగా ఉండేవి. అయితే 2023 నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 20 కార్ల జాబితాలో కేవలం నాలుగు హ్యాచ్‌బ్యాక్ కార్లు మాత్రమే ఉన్నాయి. అవన్నీ మారుతి సుజుకికి చెందినవే కావడం విశేషం.


నంబర్ వన్ స్థానంలో వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R)
2023 నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కార్లలో మొదటి స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఉంది. ఇది నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు. 2022 నవంబర్‌లో 14,720 యూనిట్లు అమ్ముడు పోగా ... 2023 నవంబర్‌లో 13 శాతం పెరిగి 16,567 యూనిట్లకు చేరుకుంది. ఇది వార్షిక ప్రాతిపదికన 13 శాతం ఎక్కువ. వ్యాగన్ ఆర్ తర్వాత రెండో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) నిలిచింది. దీని నవంబర్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఒక్క శాతం వృద్ధితో 15,311 యూనిట్లుగా ఉంది.


వీటి అమ్మకాలు కిందకి...
ఈ జాబితాలోని మిగిలిన మూడు హ్యాచ్‌బ్యాక్‌ల విషయంలో ఈ పరిస్థితి లేదు. ఎందుకంటే అవన్నీ 2023 నవంబర్ అమ్మకాల్లో క్షీణతను నమోదు చేశాయి. మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno) 12,961 యూనిట్లు అమ్ముడుపోయింది. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 38 శాతం క్షీణించాయి.


మారుతీ సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto) 2023 నవంబర్‌లో 8,076 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఒకప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ కారు అమ్మకాలు 48 శాతం క్షీణించాయి. ఆల్టో తర్వాత హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) 5,727 యూనిట్ల విక్రయాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలోకి ప్రవేశించింది. అయితే దీని అమ్మకాలు కూడా గతేడాది నవంబరుతో పోలిస్తే 21 శాతం క్షీణించాయి.


మరోవైపు రూ. 20 లక్షల కంటే తక్కువ ధరలో బడ్జెట్ టెస్లా కారు 2026లో భారతదేశంలో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. అయితే రూ. 60 లక్షల ధర కలిగిన మోడల్ 3 మాత్రం త్వరలో విడుదల కావచ్చని సమాచారం. ఈ వార్తల ప్రకారం మీరు రూ. 20 లక్షలలోపు టెస్లా కారును కొనుగోలు చేయాలనుకుంటే మరికొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. టెస్లా దాని సీబీయూ ఉత్పత్తుల్లో కొన్నింటిని భారతదేశంలో లాంచ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వీటిలో మోడల్ 3, మోడల్ వై మొదటగా రానున్నాయి. వాటి ధర రూ. 60 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇంపోర్టెడ్ ఛార్జీలలో మినహాయింపు ఇస్తే ఈ ధర మరింత తక్కువగా ఉండవచ్చు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!