CNG Cars Launched This Year: భారత మార్కెట్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే కార్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడళ్ల ధరలు 49 శాతం పెరిగినప్పటికీ సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు 40.7 శాతం పెరిగాయి. ప్రస్తుతం భారత ఆటోమోటివ్ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలు దాదాపు 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. 2023లో ఏడు సీఎన్‌జీ కార్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో టాటా నుంచి నాలుగు కార్లు, మారుతి నుంచి రెండు, టయోటా నుంచి ఒకటి ఉన్నాయి.


టాటా అల్ట్రోజ్ సీఎన్‌జీ
టాటా మోటార్స్ కొత్త ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీతో ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ సీఎన్‌జీని 2023 మేలో విడుదల చేసింది. సన్‌రూఫ్‌తో వస్తున్న మొదటి సీఎన్‌జీ హ్యాచ్‌బ్యాక్ ఇదే. ఇది టాటా సీఎన్‌జీ టెక్నాలజీతో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది గరిష్టంగా 77 బీహెచ్‌పీ శక్తిని, 103 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.55 లక్షల నుంచి రూ.10.55 లక్షల మధ్య ఉంది.


టాటా టియాగో/టిగోర్ సీఎన్‌జీ
టాటా మోటార్స్ కొత్త ట్విన్ సిలిండర్ సీఎన్‌జీతో టియాగో హ్యాచ్‌బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌లను పరిచయం చేసింది. టాటా టియాగో సీఎన్‌జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.55 లక్షల నుంచి, టాటా టిగోర్ సీఎన్‌జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.20 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెండు సీఎన్‌జీ కార్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయిన 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ మోటారును ఉపయోగిస్తాయి.


టాటా పంచ్ సీఎన్‌జీ
టాటా పంచ్ మోడల్ లైనప్ ఐదు సీఎన్‌జీ వేరియంట్‌లను కలిగి ఉంది. ప్యూర్, అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డాజిల్ ఎస్ మోడల్స్‌లో అందుబాటులో ఉంది. వీటి ధర రూ. 7.10 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఇందులో సీఎన్‌జీ కిట్‌తో కూడిన 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.


మారుతి బ్రెజా సీఎన్‌జీ
మారుతి సుజుకి బ్రెజా సీఎన్‌జీతో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ. 2023 మార్చిలో లాంచ్ అయిన ఈ మోడల్లో నాలుగు వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూమ్ ధర రూ.9.24 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.5 లీటర్ కే15సీ డ్యూయల్‌జెట్ ఇంజన్ కలదు.


మారుతి గ్రాండ్ విటారా సీఎన్‌జీ
మారుతి సుజుకి గ్రాండ్ విటారా CNG ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 12.85 లక్షల నుంచి రూ. 14.84 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయింది. దీని డెల్టా సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 13.05 లక్షలు కాగా, జెటా సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 14.86 లక్షలుగా ఉంది. ఈ ఎస్‌యూవీలో సీఎన్‌జీ కిట్‌తో కూడిన 1.5 లీటర్ కే15 పెట్రోల్ ఇంజన్ అందించనున్నారు.


టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్‌జీ
టయోటా కిర్లోస్కర్ మోటార్ జనవరిలో హైరైడర్ సీఎన్‌జీని రూ. 13.23 లక్షల ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ఇది ఎస్, జీ అనే రెండు వేరియంట్‌ల్లో లభిస్తుంది. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ కే12సీ ఇంజిన్‌తో 103 బీహెచ్‌పీ పీక్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!