Bigg Boss 7 Telugu Winner: తెరపై నటీనటులను, వారు పోషించే పాత్రలను చూసి.. వారు బయట ఎలా ఉంటారో డిసైడ్ అయిపోకూడదు అని చెప్పడానికి అమర్‌దీపే పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పటికే అమర్‌ను ఎన్నో సీరియల్స్‌లో నటుడిగా చూశారు బుల్లితెర ప్రేక్షకులు. అప్పుడప్పుడు కొన్ని షోలలో కూడా పాల్గొనడం కూడా చూశారు. కానీ అసలు అమర్‌దీప్ అంటే ఎలా ఉంటాడు, బయట ఎలా మాట్లాడతాడు, కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయం తనను అభిమానించే ప్రేక్షకులకు తెలియదు.


అందుకే బిగ్ బాస్ సీజన్ 7లోకి అడుగుపెట్టిన తర్వాత అమర్‌దీప్‌ను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆన్ స్క్రీన్ సీరియస్‌గా యాక్టింగ్ చేసే వ్యక్తి.. ఆఫ్ స్క్రీన్ ఇలా ఉంటాడా అని అనుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకడిగా మారి, ఫైనల్స్ వరకు వచ్చాడంటే.. దానికి అమర్ అమాయకత్వం కూడా కారణమే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


తనపైనే జోకులు, పంచులు


బిగ్ బాస్ సీజన్ 7లోకి అందరు కంటెస్టెంట్స్ ఒక స్ట్రాటజీతోనే వచ్చారు. అలాగే అమర్‌దీప్ కూడా వచ్చాడు. కానీ మొదటి కొన్ని వారాల వరకు అసలు అమర్ స్ట్రాటజీ మాత్రమే కాదు.. గేమ్ ఏంటో కూడా ప్రేక్షకులకు అర్థం కాలేదు. హౌజ్‌లోకి ఎంటర్ అయిన అందరు కంటెస్టెంట్స్‌లో అమర్ గేమే చాలా వీక్‌గా అనిపించేది. ప్రేక్షకులు మాత్రమే కాదు.. నాగార్జున కూడా అదే ఫీల్ అయ్యారు. అందుకే ఎప్పటికప్పుడు అమర్‌ను మోటివేట్ చేయడానికి ప్రయత్నించారు.


అలా ఆరవ వారం నుంచి తన ఆట ఏంటో చూపించడం మొదలుపెట్టాడు అమర్. టాస్కుల్లో ఎక్కువగా పాల్గొన్నాడు. ఎంటర్‌టైన్మెంట్, ఫన్ విషయంలో మిగతా కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అమర్ కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు. ఆడియన్స్‌ను నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విషయంలో తనపై అందరూ జోకులు వేసినా.. పంచులు వేసినా.. ఆఖరికి సరదాగా కొట్టినా కూడా అమర్ పెద్దగా పట్టించుకోడు. అదే తనలో ఉన్న పెద్ద ప్లస్ అని ప్రేక్షకులు భావిస్తున్నారు.


ఫౌల్ గేమ్స్ ఆడినా.. చీటింగ్ చేసినా.. అందులో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ లభించింది. అది నెగిటివ్ కంటెంట్ అని శివాజీ భావించినా కూడా.. అదే చూసి ప్రేక్షకులు నవ్వుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి. అలిగినా, గొడవపడినా.. ఫ్రెండ్స్‌ను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు అమర్. అందుకే తను కెప్టెన్ అవ్వకపోయినా కూడా పట్టుదలతో ఆడి తన ఫ్రెండ్ శోభాను కెప్టెన్ చేశాడు. చివరికి టాస్కులు ఆడి కెప్టెన్ అవ్వలేకపోయినా.. తన అమాయకత్వంతో కెప్టెన్సీని సంపాదించుకున్నాడు.


బ్యాక్‌బిచ్చింగ్‌కు కేరాఫ్ అడ్రస్


బిగ్ బాస్‌లో హౌజ్‌మేట్స్ గురించి వారి వెనుక ఎక్కువగా మాట్లాడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది అమర్‌దీపే. తన ఫ్రెండ్స్‌తో సహా దాదాపు అందరు కంటెస్టెంట్స్ గురించి అమర్ బ్యాక్‌బిచ్చింగ్ చేశాడు. మొదటి అయిదు వారాల వరకు ప్రేక్షకులకు ఎక్కువగా కనిపించకుండా అమర్ సేఫ్ గేమ్ ఆడాడని చాలామంది భావించారు. అందుకే ఆ అయిదు వారాల్లో ప్రేక్షకుల దృష్టిలో నెగిటివ్ అయిన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. అమర్ సేఫ్ అయిపోయాడు.


ఇక టాస్కులు ఆడడం మొదలుపెట్టిన తర్వాత తను చాలా స్వార్థపరుడు అయ్యాడని ప్రేక్షకులు మాత్రమే కాదు.. తోటి కంటెస్టెంట్స్ కూడా ఫీల్ అయ్యారు. తను ఆడిన ప్రతీ టాస్కులో తానే గెలవాలి అనుకోవడం, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోతే వారిని మాటలతో మానసికంగా హింసించడం చేసేవాడు అమర్. ఒక్క టాస్కే కదా.. మళ్లీ గెలవచ్చులే అన్న యాటిట్యూడ్ అమర్‌లో కనిపించలేదు.


అంతే కాకుండా గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏడ్చి సాధించుకోవడాన్ని స్ట్రాటజీగా ఉపయోగించాడు. సందర్భం ఉన్నా లేకపోయినా ఏడ్చి తన పాయింట్‌ను నిరూపించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తన అమాయకత్వం వల్ల ఫైనల్స్ వరకు వచ్చినా విన్నర్ అవ్వడానికి మాత్రం ఇంకా దూరంగానే ఉన్నాడని సోషల్ మీడియాలో పోల్స్ చెప్తున్నాయి.


Also Read: ముంబైలో చెర్రీ ఫ్యామిలీ - క్లింకారాకు కరీనా కొడుకు తైమూర్ ఆయా సాయం?