సినీ సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. ఫోటోగ్రాఫర్లు అక్కడ వాలిపోతారు. తాజాగా రామ్ చరణ్ విషయంలో కూడా అదే జరిగింది. గత నాలుగు రోజులుగా రామ్ చరణ్.. ముంబాయ్‌లో చక్కర్లు కొడుతున్నాడు. ఇక తాజాగా తన భార్య ఉపాసన కూడా కూతురు క్లిన్ కారాతో అక్కడికి చేరుకుంది. దీంతో ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు తమ కెమేరాలకు పనిచెప్పారు. రామ్ చరణ్.. ఉపాసనను, తన కూతురు క్లిన్ కారాను వెల్‌కమ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిరోజుల పాటు రామ్ చరణ్‌తో పాటు తన ఫ్యామిలీ మొత్తం ముంబాయ్‌లోనే ఉండనున్నట్టు సమాచారం. 


రామ్ చరణ్ ఫ్యామిలీ వీడియో వైరల్..
రామ్ చరణ్.. బుధవారం ముంబాయ్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఉపాసన కూడా క్లిన్ కారాతో అక్కడికి చేరుకుంది. దీంతో రామ్ చరణ్.. వారిని వెల్‌కమ్ చేయడానికి వచ్చాడు. అదే సమయంలో మీడియా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లిన్ కారా పుట్టిన తర్వాత నుంచి ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడ కనిపించినా.. క్యూట్ ఫ్యామిలీ అంటూ వారి ఫోటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ఈసారి కూడా అదే జరిగింది. రామ్ చరణ్.. తండ్రిగా డ్యూటీ మొదలుపెట్టాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ వీరంతా ముంబాయ్‌కు రావడం వెనుక కారణమేంటి అని కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.






ముంబాయ్‌ వెళ్లింది అందుకేనా..?
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు రామ్ చరణ్. అందుకే బాలీవుడ్‌లో కూడా ఈ హీరో డెబ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంటూ కొంతకాలంగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తనతో పాటు ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన ఎన్‌టీఆర్.. ఆల్రెడీ ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి షూటింగ్‌కు కూడా సిద్ధమవుతున్నాడని వార్తలు వస్తుండగా.. రామ్ చరణ్ కూడా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పుడు రామ్ చరణ్ ముంబాయ్‌లో కొన్నిరోజులు ఉండడానికి కూడా అదే కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ వారి అభిప్రాయంలో నిజం లేదని కొందరు అంటున్నారు.


క్లింకారాకు కరీనా కొడుకు తైమూర్ హెల్పర్ సాయం?


ఈ వీడియోలో రామ్ చరణ్‌, ఉపాసన, క్లింకారాతోపాటు మరో మహిళ కూడా కనిపించింది. ఆమెను చూడగానే నెటిజన్స్.. ఆమె కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కొడుకు తైమూర్ నానీ (కేర్ టేకర్ లేదా ఆయా) కదా అని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే, అందులో ఉన్నది ఆమె కాదో తెలీదు గానీ, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. 






పర్సనల్ పని..
రామ్ చరణ్‌తో పాటు తన ఫ్యామిలీ మొత్తం ముంబాయ్‌కు ఒక పర్సనల్ పని కోసం వచ్చారని తన టీమ్ మెంబర్ తెలిపారు. చరణ్.. ఇంకా ఏ బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఒక పర్సనల్ పని కోసం చరణ్.. కొన్నాళ్లపాటు ముంబాయ్‌లో ఉండాల్సి ఉంది. అందుకే ఉపాసన కూడా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన రామ్ చరణ్.. తరువాతి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్‌తో కలిసి ‘గేమ్‌ఛేంజర్’ చిత్రాన్ని చేస్తున్నాడు చరణ్. ఈ షూటింగ్ గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రావడం లేదు. ‘గేమ్‌ఛేంజర్’ షూటింగ్ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నోసార్లు దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు కూడా రామ్ చరణ్.. ముంబాయ్‌లో ఉండడంతో ‘గేమ్‌ఛేంజర్’కు మళ్లీ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


Also Read: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్