Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ  సంవత్సరంలో  వృశ్చిక రాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయి...


వృశ్చిక రాశి ( విశాఖ నాలుగో పాదం, అనూరాధ, జ్యేష్ట )
ఆదాయం : 2 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2


ఏప్రియల్ 2025


వృశ్చిక రాశివారికి ఈ నెలలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ గురించి చర్చ జరుగుతుంది. బంధుమిత్రులు వస్తారు. ఆర్థికలాభం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  


మే 2025


ఈ నెలలో వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కలిసొస్తుంది. కోపం విపరీతంగా పెరుగుతుంది. ఒక్కోసారి ఏం మాట్లాడుతారో తెలియదు. అసహనంగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆందోళన చెందుతారు . గృహలాభం ఉంటుంది. వైవాహిక జీవితంలో స్పల్పంగా విరోధాలుంటాయి.


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 2025 -2026 లో వృశ్చిక రాశి గ్రహ సంచారం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


జూన్ 2025


ఈనెలలో కూడా మీకు పెద్దగా పరిస్థితులు అనుకూలించవు. గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల భూ సంబంధిత వ్యవహారాల్లో నష్టపోతరాు. ప్రయాణాల్లో సమస్యలు, సోదరులతో విరోధాలు తప్పవు. ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అవమానిస్తారు. అధిక కోపం ప్రభావం మీరు చేపట్టే పనులపై పడుతుంది. 
 
జూలై 2025


ఈ నెలలోనూ అష్టమంలో గ్రహసంచారం చికాకులు కలిగిస్తుంది. మానసికంగా కుంగిపోతారు. అవమానాలు పడతారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరానికి డబ్పు చేతికందుతుంది. ఆరోగ్యం బావుంటుంది. 


ఆగష్టు 2025


శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆగష్టు నెల మీకు అన్ని విధాలుగా బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా బావుంటుంది. ఏ విషయంలో అయినా ధైర్యంగా అడుగేస్తారు. నూతన వస్తులాభం ఉంటుంది. దైవసంబంధిత కార్యాలు చేస్తారు. 


 ( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


సెప్టెంబర్ 2025


ఏ పని ప్రారంభించినా అవలీలగా పూర్తిచేసేస్తారు. అడుగేసే ప్రతిచోటా లాభమే. డబ్బుకి ఇబ్బంది ఉండదు.  ఎంతటివారినైనా ఎదురిస్తారు. వాదోపవాదాలలో మీదే పై చేయి. వాహనం కొనుగోలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. విలాసవంతమైన ఖర్చులు చేస్తారు.


అక్టోబర్ 2025


ఈ నెలలో మీ మాటకు తిరుగులేదు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు. ఇంటికి సంబంధించిన కార్యాలు పూర్తవుతాయి. శత్రువులే మిత్రులుగా మారుతారు. 


నవంబర్ 2025


ఈ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. నెల ఆరంభం అద్భుతంగా ఉంటుంది కానీ సెకెండాఫ్ చికాకులు తప్పవు. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులుంటాయి. ఇతరులతో గొడవపడతారు. చేపట్టిన పనుల్లో నష్టపోతారు. ప్రభుత్వ సంబంధ లావాదేవీల్లో నష్టం తప్పదు. వాహనభయం ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది.


 (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   


డిశంబర్ 2025
 
ఈ నెలలో గ్రహాల అనుకూల సంచారం లేనందుకు మీరొకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తప్పవు. జాయింట్ వ్యాపారాలు చేసేవారు విడిపోతారు. భార్య భర్త మధ్య తాగాదాలు జరుగుతాయి. విడిపోయేవరకూ పరిస్థితులు వెళ్లినా ఆ తర్వాత శాంతిస్తారు. 


జనవరి 2026


ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం వృశ్చిక రాశివారికి అదిరిపోతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయం కూడా పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. 


ఫిబ్రవరి 2026
 
ఈ నెలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు ప్రతి విషయంలో మొండిగా వ్యవహరిస్తారు. పట్టుదల, కోపం, చికాకు వల్ల విలువైన పనులను కోల్పోతారు. అందరితో కటువుగా మాట్లాడి విరోధాలు పెంచుకుంటారు. ఆర్థికంగా నష్టపోతారు. గౌరవం తగ్గుతుంది. అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటారు.


తులా రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


మార్చి 2026


కొంతవరకూ దూకుడు తగ్గుతుంది. కోపం తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పరిస్థితులు మెరుగవుతాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
 (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)