Starlink Internet Speed: స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం సునామీతో సమానం, అందుకే అది అన్నింటికంటే భిన్నం

Starlink Internet Service: స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. అనుమతులన్నీ వచ్చిన తర్వాత మనందరం హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ పొందవచ్చు.

Continues below advertisement

Starlink Internet Speed Details: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని స్పేస్‌ఎక్స్ ‍‌(SpaceX) కంపెనీకి చెందిన స్టార్‌లింక్‌ భారతదేశంలోకి కూడా అడుగు పెట్టబోతోంది. మన దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు రిలయన్స్‌ జియో & భారతి ఎయిర్‌టెల్‌ ఇప్పటికే స్టార్‌లింక్‌ ఉపగ్రహ సేవల కోసం విడివిడిగా ఒప్పందాలు (Reliance Jio & Airtel agreements with Starlink) కుదుర్చుకున్నాయి. ఇంటర్నెట్‌ రంగంలో స్టార్‌లింక్‌ది ప్రత్యేక స్థానం. వేగవంతమైన ఉపగ్రహ కనెక్టివిటీతో భారతదేశంలో ఇంటర్నెట్‌ వ్యవస్థను మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Continues below advertisement

ప్రస్తుత సర్వీస్‌ల కంటే 80-90 రెట్ల స్పీడ్‌
నివేదికల ప్రకారం, స్టార్‌లింక్ అనేక టెరాబైట్‌ల వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందించగలదు. ఇది భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన యూటెల్‌సాట్ వన్‌వెబ్ & రిలయన్స్ జియో-SIS వంటి అనేక ప్రస్తుత ఇంటర్నెట్‌ సర్వీస్‌ల కంటే 80 నుంచి 90 రెట్లు వేగంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్‌ సర్వీస్‌లు 30 నుంచి 50 Gbps వరకు మాత్రమే వేగాన్ని అందిస్తాయి. 

స్టార్‌లింక్ తన అంతరిక్ష ఉపగ్రహ నెట్‌వర్క్ సాయంతో భారతదేశం అంతటా కోట్లాది మంది వినియోగదారులకు అత్యంత హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. 'టెలికమ్యూనికేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌' (DoT), 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్' (IN-SPACe) నుంచి అనుమతులు పొందడంలో ఇప్పుడు ఆలస్యం జరుగుతోంది. హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను లాంచ్‌ చేయడానికి, స్టార్‌లింక్ ఇప్పటికే DoT నుంచి 'గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ త్రూ శాటిలైట్' లైసెన్స్‌ పొందింది. అవసరమైన పత్రాలను IN-SPACe కు సమర్పించింది. కొన్ని ఆమోదాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. 

స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్ & జియో
భారతి ఎయిర్‌టెల్ & రిలయన్స్‌ జియో కూడా స్టార్‌లింక్‌తో చేతులు కలిపి దేశంలో ఉపగ్రహం ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించనున్నాయి. భారతదేశంలో ఉపగ్రహ సేవలను ప్రారంభించడానికి అవసరమైన అనుమతిని కూడా ఈ కంపెనీలు పొందాయి, ఇప్పుడు స్పెక్ట్రం కేటాయింపు కోసం ఎదురు చూస్తున్నాయి. రిలయన్స్‌ జియో & భారతి ఎయిర్‌టెల్ తమ రిటైల్ అవుట్‌లెట్‌లు, ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా స్టార్‌లింక్ పరికరాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాయి. దీనికి అదనంగా, రిలయన్స్‌ జియో ఇన్‌స్టాలేషన్ & యాక్టివేషన్ మద్దతును కూడా అందిస్తుంది. దీనివల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోనూ ఇంటర్నెట్ సేవలు అందించడం సాధ్యం అవుతుంది.  

ఇతర సర్వీస్‌లకు - స్టార్‌లింక్‌కు ఏంటి వ్యత్యాసం?
గ్రౌండ్ కేబుల్స్ లేదా మొబైల్ టవర్లపై ఆధారపడే సాధారణ ఇంటర్నెట్ సేవల మాదిరిగా కాకుండా, స్టార్‌లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం 'భూమి దిగువ కక్ష్య' (లో ఎర్త్‌ ఆర్బిట్‌ - LEO) ఉపగ్రహ సాంకేతికతను ఉపయోగిస్తుంది. భూమికి దిగువన ఉన్న కక్ష్య అంటే భూమి నుంచి 2,000 కి.మీ. లేదా అంతకంటే తక్కువ దూరంలో ఉన్న కక్ష్య. స్టార్‌లింక్‌కు చెందిన దాదాపు 7,000 ఉపగ్రహాలు ఈ కక్ష్యలో భూమి చుట్టూ తిరుగుతున్నాయి. భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ఉపగ్రహాలు అందించే ఇంటర్నెట్ చాలా వేగంగా ఉంటుంది. రాబోయే కాలంలో మరిన్ని స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉంది. 

 

Continues below advertisement