Conjunction of Saturn and Rahu 2025: కొత్త సంవత్సరం 2025 కి స్వాగతం పలికేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు పరివర్తనం చెందే గ్రహాల్లో కీలక గ్రహాలు నూతన ఏడాదిలో రాశులు మారుతున్నాయి.  గురు, శని, రాహు-కేతువులు వంటి ప్రభావవంతమైన గ్రహాలు రాశిచక్రాలను మారుస్తాయి. ఈ పెద్ద గ్రహాల రాశి మార్పులు 2025 సంవత్సరంలో దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు దాని అసలు త్రిభుజం రాశిలో ఉన్న తర్వాత ప్రతి రాశికి చెందిన వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయి. 


న్యాయం, కర్మ ఆధారంగా  ఫలితాలను ఇచ్చే శని 29 మార్చి 2025 న బృహస్పతి రాశి అయిన మీనంలోకి ప్రవేశిస్తుంది. శని మీనంలోకి ప్రవేశించినప్పుడు.. రాహు గ్రహం  అక్కడే ఉంటుంది. అంటే.. మీన రాశిలో రాహు-శని కలయిక ఏర్పడబోతోంది. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాహువు - శని ఒకరికొకరు స్నేహితులు. అందుకే ఈ కలయిక కొన్ని రాశులకు శుభ సంకేతాలను ఇస్తుంది. 


2025 సంవత్సరంలో రాహు-శని సంయోగం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.


Alkso Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!


మేష రాశి


2025 సంవత్సరంలో  రాహు-శని కలయిక మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక మేషరాశి వ్యక్తుల పన్నెండవ ఇంట్లో జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం పొందవచ్చు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. వృత్తి , వ్యాపారం, ఉద్యోగంలో కలిసొస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు తలుపుతడతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. 


వృషభ రాశి


2025వ సంవత్సరంలో మీనరాశిలో స్నేహ గ్రహమైన శని - రాహువు కలయిక ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి పదకొండవ స్థానంలో సంచరిస్తోంది.  పదకొండవ ఇంట్లో రాహు-శని కలయిక వల్ల ఆదాయం పెరుగుతుంది. కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కార్యాలయంలో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. కెరీర్ రంగంలో పెద్ద విజయాలు సాధిస్తారు.  మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు. ఆకస్మిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి జీతం పెరగడంతో పాటు ప్రమోషన్‌కు అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. మీరు అదృష్టాన్ని పొందుతారు, ఇది పురోగతికి దారి తీస్తుంది.


Also Read: కన్యారాశి వారికి కొత్త సంవత్సరం 2025 ఎలా ఉంటుంది.. ఏ రంగాల్లో సక్సెస్ అవుతారో తెలుసా!


తులా రాశి


2025లో శని, రాహువుల సంయోగం తులారాశికి ఆరో స్థానలో జరగనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జాతకుడి ఆరో స్థానంలో రాహువు, శని కలయికను వ్యాధులు, శత్రువులకు చెక్ పెట్టేందుకు సహకరిస్తాయి. అంటే రాహు, శని మీ రాశి నుంచి ఆరో స్థానంలో సంచారం సమయంలో మీకున్న దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మీ ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవితంలో సంతోషకర క్షణాలు ఆస్వాదిస్తారు.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!