డిసెంబర్ 27 రాశిఫలాలు
మేష రాశి
ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న సమస్య తీరుతుంది. కళతో సంబంధం ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల గురించి ఆందోళన చెందుతారు.
వృషభ రాశి
ఈ రోజు కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల వివాహాల గురించిన ఆందోళనలు తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో కొత్తదనం ఉంటుంది. అనేక సమస్యలు ఏకకాలంలో పరిష్కారమవుతాయి. ప్రయాణం చేయవచ్చు. మీ స్నేహితుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు:
మిథున రాశి
ఈ రోజు మీరు మీ పనిచేసే ప్రదేశంలో నిపుణులతో చర్చిస్తారు. డబ్బుకు సంబంధించిన పాత సమస్యలు పరిష్కారమవుతాయి. పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా పూర్తవుతాయి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు
Also Read: 2025లో ధనుస్సు రాశి వారికి అష్టమ శనితో చికాకులు..బృహస్పతి సంచారంతో ఉపశమనం!
కర్కాటక రాశి
ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పరస్పర చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. అసమతుల్యమైన ఆహారపు అలవాట్లు అజీర్తిని కలిగిస్తాయి. వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి.
సింహ రాశి
ఈ రోజు మీ ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఈ ఉదయం నుంచి మీ మానసిక స్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులపై పని ఒత్తిడి పెరుగుతుంది. మీ డబ్బును సద్వినియోగం చేసుకోండి.
కన్యా రాశి
అనవసరంగా ఖర్చు పెట్టకండి. ఈరోజు మీరు ప్రతి పనిలో సంయమనం పాటిస్తారు. మేధావుల సహవాసం లభిస్తుంది. మీ రహస్య శత్రువుల బలహీనత మీకు తెలిసి రావచ్చు. వ్యసనానికి దూరంగా ఉండండి. మీ సేవాభావం ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
Also Read: కొత్త ఏడాది ఆరంభంలో శని..ఆ తర్వాత బృహస్పతి సంచారంతో మీ జీవితంలో భారీ మార్పులు!
తులా రాశి
ఈ రోజు మీరు శుభ కార్యక్రమాలకు సిద్ధపడతారు. కొత్త పనులు ప్రారంభించగలరు. కమీషన్ సంబంధిత వ్యాపారంలో లాభం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి
వృశ్చిక రాశి
ఈ రోజు అధికారులు మీ పనిని చూసి చాలా సంతోషిస్తారు. రోజంతా బిజీగా ఉంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. తార్కిక అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలను తెలియజేస్తారు. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
ధనస్సు రాశి
ఈ రోజు టూరిజం సంబంధిత వ్యాపారంలో ఉండే ఈ రాశివారు నష్టపోతారు. మీ బలహీనతలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఏదైనా పోగొట్టుకున్న వస్తువు సాయంత్రం నాటికి తిరిగి పొందుతారు. ఓ ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయండి.
మకర రాశి
ఈ రోజు మీరు మీ కార్యాలయంలో శుభవార్తలను అందుకుంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. అపరిచితుల నుంచి సురక్షితంగా ఉంటారు. అప్పు ఇవ్వడం మానుకోండి. వ్యాపారంలో లాభం ఉంటుంది
కుంభ రాశి
ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. పనిని పూర్తి చేయాలనే ఉత్సాహం ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయావకాశాలున్నాయి. శుభ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటారు.
Also Read: అదృష్టం - దురదృష్టం.. 2025లో తులా రాశి వారు ఏవైపు తూగుతున్నారు!
మీన రాశి
ఆర్థిక పురోగతికి అవకాశం ఉంది. ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోవచ్చు. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు. ఇంటి ఖర్చుల వల్ల మానసిక ఒత్తిడి, మనస్పర్థలు ఏర్పడతాయి. సమస్యలను తల్లిదండ్రులకు చెబుతారు. అనారోగ్య సమస్యలుంటాయి.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.