RINL-VSP Graduate and Technician Apprenticeship Trainees: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జనవరి 9లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నుంచి రూ.8,000 స్టైపెండ్‌గా ఇస్తారు.
వివరాలు..
* అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 250.
శిక్షణకాలం: ఏడాది.
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 200.
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, సెరామిక్స్.
2) టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ: 50.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. 2022, 2023, 2024 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, సిరామిక్స్, మెటలర్జి, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజులేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. నాట్స్ (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఆధారంగా ఎంపికచేస్తారు. నిర్ణీత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నుంచి రూ.8,000 స్టైపెండ్‌గా ఇస్తారు.
శిక్షణ కాలం: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 09.01.2025.
ALSO READ:
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో 68 స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గలవారు జనవరి 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..