Rahul Gandhi Gets Emotional On Manmohan Singh's Demise: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రాహుల్ గాంధీ భావోద్వేగమైన పోస్టు రాసుకొచ్చారు. "మన్మోహన్ సింగ్ జీ భారతదేశాన్ని అపారమైన జ్ఞానం, సమగ్రతతో నడిపించారు. ఆయన వినయం, ఆర్థికశాస్త్రంపై లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. కౌర్, ఆమె కుటుంబ సభ్యులకు నా సానుభూతి. నేను ఒక గురువు, మార్గదర్శిని కోల్పోయాను. ఆయనను అభిమానించే మిలియన్ల మందితోపాటు మేం కూడా ఆయనను ఎంతో గర్వంగా గుర్తుంచుకుంటాం."
కోట్లమంది భారతీయులను పేదరికం నుంచి బయటపడేసిన వ్యక్తి: మల్లికార్జున ఖర్గే
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంతాపం తెలిపారు. మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, మాటల కంటే క్రియాత్మక వ్యక్తి, దేశ నిర్మాణానికి ఆయన చేసిన సాటిలేని కృషి భారతదేశ చరిత్రలో ఎప్పటికీ లిఖించి ఉంటుందన్నారు. ఖర్గే సోషల్ మీడియా వేదికపై ఇలా రాశారు.... నిస్సందేహంగా, చరిత్ర మిమ్మల్ని వినయంతో గౌరవిస్తుంది మన్మోహన్ సింగ్ జీ! మాజీ ప్రధాని మరణంతో, భారతదేశం ఒక దార్శనిక రాజకీయవేత్తను, నిష్కళంకమైన నాయకుడిని, అద్వితీయమైన ఆర్థికవేత్తను కోల్పోయింది. ఆయన ఆర్థిక సరళీకరణ విధానం, హక్కుల ఆధారిత సంక్షేమ నమూనా కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చింది. భారతదేశంలో మధ్యతరగతిని సృష్టించింది. కోట్లాది మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసింది.
ప్రియాంక గాంధీ ఏమన్నారంటే?
మన్మోహన్ సింగ్ ఎప్పుడూ తమకు స్ఫూర్తిగా ఉంటారని ఎంపీ ప్రియాంకగాంధీ అన్నారు. ఆయనపై వ్యక్తిగత దాడులు చేసినా దేశం కోసం నిటారుగా నిలబడ్డారని అభిప్రాయపడ్డారు. "సర్దార్ మన్మోహన్ సింగ్ జీ మాదిరి రాజకీయాల్లో చాలా తక్కువ మంది మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారు. ఆయన నిజాయితీ ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా ఉంటుంది. ప్రత్యర్థుల వ్యక్తిగత దాడులకు గురైనప్పటికీ దేశానికి సేవ చేయాలనే నిబద్ధతతో స్థిరంగా ఉన్న వ్యక్తిగా ఈ దేశాన్ని నిజంగా ప్రేమించేవారిలో ఆయన ఎప్పటికీ నిలుస్తారు. ఆయన చివరి వరకు నిజమైన సమతావాదిగా, తెలివైన వ్యక్తిగా, దృఢ సంకల్పం ధైర్యంగా ఉంటూ రాజకీయ ప్రపంచంలో ప్రత్యేకమైన గౌరవప్రదమైన సున్నితమైన వ్యక్తిగా ఉన్నారు."
రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌ను చించివేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చెప్పారు?
2013లో ‘కళంకిత ఎంపీలు, ఎమ్మెల్యేల’పై యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ ‘అసంబద్ధం’ అంటూ చించివేశారు. అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ అంశంపై రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయన కోపానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను.
Also Read: లెక్చరర్ నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన మన్మోహన్ సంపాదించిన ఆస్తులెన్ని? ఆయన ఏం చదువుకున్నారు?