New Year Astrology Prediction 2025: తులారాశి వారికి కొత్త సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకుంటారు..అనుకున్నది సాధిస్తారు. కొత్తఏడాది 2025 ఆరంభంలో ఏం చేసినా కలిసొస్తుంది. వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలుంటాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు.  మీ ప్రవర్తనా విధానం మెచ్చుకోలుగా ఉంటుంది. అయితే ఏడాది ఆరంభంలో ఈ రాశి ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.  ఆ తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన ప్రారంభాలకు ఈ ఏడాది చాలా మంచిది. అవివాహితులకు పెళ్లి జరుగుతుంది. ఏడాది ఆరంభంలో గృహ జీవితం కాస్త బలహీనంగా ఉంటుంది కానీ ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు చదువులో అడ్డంకులు ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల ఫలిస్తుంది.ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 


Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!


జనవరి 2025


 ఈ నెలలో తులా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. అనుకోని ఖర్చులుంటాయి. ఆరోగ్యం బావుంటుంది. ఏవిషయంలో అయినా పట్టుదలతో వ్యవహరిస్తారు. వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి జాగ్రత్త. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు తగదు. 


ఫిబ్రవరి 2025


ఈ నెలలోనూ మీరు చేయని తప్పులకు అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెరిగిన ఆదాయంతో పాటూ ఖర్చులు అధికం అవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ధైర్యంగా వ్యవహరించండి


 


మార్చి 2025


ఈ నెలలోనూ మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది కానీ మీ కోపం మీకు శత్రువుగా మారుతుంది. మాటతీరు సరిగా లేకపోవడం వల్ల అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. మిత్రులే శత్రువులవుతారు. అనారోగ్య సమస్యలు,చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి


ఏప్రిల్ 2025


ఈ నెలలో మీకు అనుకూల ఫలితాలు లేవు. ఉద్యోగులకు బదిలీలు, గృహస్థులకు ఇంటి మార్పులు ఉంటాయి. ఆస్తులు కొనుగోలు అమ్మకాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. 


మే 2025


ఈ నెల నుంచి మీకు అనుకూల ఫలితాలు మొదలవుతాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. అవివాహితులకు వివాహం ప్రయత్నాలు సఫలం అవుతాయి. శత్రువులపై పైచేయి సాధిస్తారు.  


జూన్ 2025


ఈ నెలలో దైవసందర్శన చేస్తారు. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. 


జూలై 2025


ఈ నెలలో తులారాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలం అవుతాయి. వాహనభయం వెంటాడుతుంది 


ఆగస్టు 2025


ఈ నెలలో మీకు అదృష్టం కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 


సెప్టెంబర్ 2025
 
ఈ నెలలో మీకు అంత అనుకూల ఫలితాలు లేవు. మీతిమీరిన ఆగ్రహం మీకు చేటు తెస్తుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయలేరు. శుభకార్యాల్లో పాల్గొనడంతో కొంత సంతోషంగా ఉంటారు. 


Also Read: కన్యారాశి వారికి కొత్త సంవత్సరం 2025 ఎలా ఉంటుంది.. ఏ రంగాల్లో సక్సెస్ అవుతారో తెలుసా!


అక్టోబర్ 2025


ఈ నెల లో మిమ్మల్ని మానసిక ఆందోళన వెంటాడుతుంది. అనుకోని అపవాదులు ఎదుర్కొంటారు. చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి కానీ ధైర్యంగా పూర్తిచేస్తారు. స్నేహితల నుంచి సహకారం ఉంటుంది. 


నవంబర్ 2025
 
 ఈ నెలలో వృత్తి , వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చుల వల్ల కొత్త సమస్యలు తప్పవు. 


డిసెంబర్ 2025


ఇయర్ ఎండ్ కూడా తులా రాశివారికి అనుకోని వివాదాల్లో చిక్కుకునేలా చేస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి గడ్డుకాలమే. కుటుంబంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది.


Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది