కన్యా రాశివారికి 2025 మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. 

విద్యార్థులు (Virgo Education Horoscope 2025)విద్యార్థులకు 2025 ఫిబ్రవరి తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ ఒత్తిడి పెరుగుతుంది. ఆగస్టు నుంచి అక్టోబరు వరకూ ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. 

వైవాహిక జీవితం (Virgo Marriage Horoscope 2025)సెప్టెంబర్ నుంచి ఏడాది చివరి వరకూ వైవావిగ జీవితంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఏడాది ఆరంభంలో వివాదాలు జరుగుతాయి. ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది..కానీ మాటల్లో సంయమనం పాటించాలి. 

ఆర్థిక పరిస్థితి (Virgo Economic Horoscope 2025)ఏడాది ఆరంభంలో కన్యారాశివారు ధనలాభం పొందే అవకాశం ఉంది. మీరు ఫిబ్రవరి నెలలో అనేక వనరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కానీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టవద్దు. ఏప్రిల్ మధ్యకాలం తర్వాత నిలిచిపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. సెప్టెంబర్   నుంచి డిసెంబర్   వరకు కన్యారాశి వారికి డబ్బు సంబంధిత విషయాలలో సమస్యలు ఎదురుకావచ్చు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండవలసి ఉంటుంది.

వ్యాపారులకు (Virgo Business Horoscope 2025)కన్యా రాశి వ్యాపారులకు ఈ సంవత్సరం బాగా ఉంటుంది. ఏడాది పొడవునా వ్యాపారంలో లాభదాయకమైన అవకాశం ఉన్నప్పటికీ, ఆగష్టు తర్వాత ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది

Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది

ఉద్యోగులు  (Virgo Career Horoscope 2025)ఉద్యోగం ఎదురుచూస్తున్న వారి అన్వేషణ ఈ ఏడాది ఫలిస్తుంది. ఏప్రిల్ చివరిలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ఉద్యోగంలో చేరాలన్నా, ఉద్యోగం మారాలన్నా మరోసారి ఆలోచించి అడుగువేయండి. ఈ ఏడాది ఈ రాశికి చెందిన ఉద్యోగులకు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు ప్రేమ జీవితం (Virgo Love  Horoscope 2025)

కన్యా రాశివారికి ఏడాది ఆరంభంలో ప్రేమ భాగస్వామితో ఏదో ఒక విషయంలో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అక్టోబరు నుంచి డిసెంబర్ వరకూ బంధం బలపడుతుంది. 

ఆరోగ్యం (Virgo Health Horoscope 2025)

కొత్త ఏడాదిలో జనవరి, ఏప్రిల్, జూన్, సెప్టెంబర్ నెలల్లో అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆహారంలో మితంగా ఉండండి. నవంబర్,  డిసెంబర్ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది

Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!

జనవరి 2025 - ఉద్యోగం, వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి..కుటుంబంలో చిన్నపాటి వివాదాలుంటాయి 

ఫిబ్రవరి 2025 - ఈ నెలలో కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది

మార్చి 2025 - ఈ నెలలో ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. ప్రయాణాలు చేస్తారు. వ్యవసాయదారులకు శుభసమయం 

ఏప్రిల్ 2025 - ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి కానీ..చెడుస్నేహాలు చేస్తారు. ఆర్థికనంగా నష్టపోతారు 

మే 2025 - ఈ నెలలో కొత్త పరిచయాలుంటాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో జయం తథ్యం

జూన్ 2025 - ఈ నెలలో మీకు అనుకూల ఫలితాలు లేవు. అనుకోని ప్రయాణాలు, ధననష్టం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. 

జూలై 2025 - ఈ నెలలో అశుభ వార్తలు వినాల్సి రావొచ్చు.. అనుకోని విరోధాలు , మాటపట్టింపులు తప్పవు

Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!

ఆగస్టు 2025 - కన్యా రాశివారికి ఆగస్టు అనుకూలంగా లేదు. ఉద్యోగం, వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది.  

సెప్టెంబర్ 2025 - గత కొన్ని నెలలుగా ఉన్న ఇబ్బందులు తొలగి ప్రశాంతత లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కొన్నిపనుల్లో ఆటంకాలు ఉన్నా చివరకు పూర్తిచేస్తారు. 

అక్టోబర్ 2025 - అక్టోబరులో చికాకులు, వివాదాలు తప్పవు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

నవంబర్ 2025 - ఈ నెలలో శత్రుభయం, అవమానాలు, పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో బాగానే ఉంటుంది. 

డిసెంబర్ 2025 - ఈ నెలలో చెడువార్తలు వినాల్సి రావొచ్చు. వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూల ఫలితాలు లేవు. చీటికి మాటికి విరోధాల్లో చిక్కుకుంటారు.  

Also Read: నూతన సంవత్సరం 2025లో ఈ రాశులవారికి పెళ్లైపోతుంది!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.