Marriage Prediction New Year 2025: పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశులవారి నిరీక్షణకు 2025లో ఫలితం దక్కుతుంది. ఈ రాశుల వారికి కొత్త సంవత్సరంలో వివాహ అవకాశాలు ఉన్నాయి. ఒక్కో గ్రహం ఒక్కో విషయంలో ఉన్నతిని సూచిస్తుంది. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, వైవాహిక జీవితం, ప్రేమ, ప్రశాంతత ఇలా నవగ్రహాలు ప్రభావం ప్రతి ఒక్కరి జాతకంలోనూ ఉంటుంది.


నవగ్రహాల్లో శుక్రుడిని ప్రేమ, ఐశ్వర్యం, విలాసాధిపతిగా చెబుతారు.ఓ వ్యక్తి  జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, వ్యక్తి తన ప్రేమ జీవితం,  వైవాహిక జీవితంలో ఆనందాన్ని కలిగి ఉంటాడు. శుక్ర సంచారానికి శని, గురు అనుగ్రహం కూడా తోడైతే ఏళ్ల తరబడి వివాహానికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయ్ అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మరి 2025 లో ఏ ఏ రాశులవారికి వివాహం జరుగుతుందో తెలుసుకోండి..


Also Read: ఈ రాశివారికి నూతన సంవత్సరం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ అదిరిపోతుంది - సింహ రాశి వార్షిక ఫలితాలు 2025!


వృషభ రాశి 


ఈ రాశి వారికి 2025 సంవత్సరం వివాహ పరంగా సంతోషాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారిపై శని , బృహస్పతి ప్రత్యేక ప్రభావం చూపుతాయి. శుక్ర సంచారం అనుకూల ప్రభావం చూపిస్తోంది. దీంతో వివాహానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రేమ సంబంధాలు సఫలం అవుతాయి. కోరిన భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించగలరు. ఇందుకు కుటుంబం, స్నేహితుల మద్దతు కూడా పొందుతారు. 
 
కన్యా రాశి


2025 కన్యారాశికి చెందిన ఒంటరి వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపుతుంది. ప్రేమ సంబంధాలలో స్థిరత్వం ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి  2025 ప్రధమార్థంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధాలు బలపడతాయి. మంచి వివాహ ప్రతిపాదనలు పొందుతారు. 


Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!


వృశ్చిక రాశి


2025 ఏడాది వృశ్చిక రాశివారికి అద్భుతంగా కలిసొస్తుంది. ఈ ఏడాది మీకు అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. వివాహం చేసుకోవాలి అనుకునేవారికి నూతన సంవత్సరం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.  2025 మే ముగిసేవరకూ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.  


ధనస్సు రాశి 


ఈ రాశి అవివాహితులకు కూడా 2025లో పెళ్లి జరిగిపోతుంది. ఈ ఏడాది కుజుడు, గురు గ్రహ ప్రభావం వల్ల వివాహానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశికి చెందిన అవివావిహులకు ఈ ఏడాది ఓ ఇంటివారు అవడమే కాదు జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు.  


Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!


మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! 
కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!


ఎన్నో శుభ గుణాలు కలిగిన ఓ కన్యక..నేను ఈ మాంగళ్యాన్ని నీ మెడలో కడుతున్నాను..నువ్వు వందేళ్లు నాతో సంతోషంగా జావించాలనే ఈ మంత్రాన్ని పఠిస్తూ మంగళసూత్రం మెడలో కడతారు. మంగళ సూత్రం భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుంచి తొలగిస్తుందని విశ్వాసం.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది