'నాంది'తో నరేష్ సీరియస్ ట్రాక్ ఎక్కారు. ఆ మూవీ మంచి హిట్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఈసారి నరేష్ పక్కా మాస్ క్యారెక్టర్ చేశారు. రూరల్ రస్టిక్ డ్రామా 'బచ్చల మల్లి'తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. హైదరాబాద్ సిటీ, అమెరికాలో కొన్ని లొకేషనల్లో పెయిడ్ ప్రీమియర్లు వేశారు. సినిమా చూసిన జనాలు ఏమంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఏంటి? వంటి వివరాల్లోకి వెళితే...
నరేష్ యాక్టింగ్ అదరగొట్టాడు!
బచ్చల మల్లి క్యారెక్టర్లో నరేష్ యాక్టింగ్ అదరగొట్టారని నెటిజనులు చెబుతున్నారు. ఈ విషయంలో మిక్స్డ్ టాక్ ఏమీ లేదు. సినిమా బాలేదని చెప్పిన జనాలు సైతం నరేష్ నటనను మెచ్చుకుంటున్నారు.
అల్లరి నరేష్ పెర్ఫార్మన్స్ అయితే ఆయన కెరీర్ లో వన్నాఫ్ ది బెస్ట్ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరొక నెటిజన్ అయితే నరేష్ నటనతో ఇంప్రెస్ చేశారని, మెచ్యూర్డ్ యాక్టింగ్, ఆ పాత్రకు తగ్గట్టు చేశారని తెలిపారు.
Also Read: మెడలో మంగళ సూత్రంతోనే కీర్తి సురేష్ - బాలీవుడ్ సినిమా ప్రమోషన్‌లోనూ ట్రెడిషన్స్ వదల్లేదు
సినిమాకు మాత్రం మిక్స్డ్ టాక్!
నరేష్ నటనకు మంచి పేరు వస్తే... సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. డైరెక్టర్ సుబ్బు మంగాదేవి సెలెక్ట్ చేసుకున్న స్టోరీ కోర్ పాయింట్ బావున్నప్పటికీ... ఆయన తీసిన తీరు బాలేదని, రొటీన్ స్క్రీన్ ప్లేతో తీయడం వల్ల సోల్ మిస్ అయ్యిందని కొంత మంది నెటిజనులు పేర్కొంటున్నారు.
రూరల్ డ్రామాల్లో మనం చూసే సన్నివేశాలు చాలా 'బచ్చల మల్లి' సినిమాలో ఉన్నాయని నెటిజన్స్ చెబుతున్నారు. అక్కడక్కడ కొన్ని ప్రామిసింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ డైరెక్టర్ సరిగా తీయలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. దాంతో సినిమా ఎటువంటి ఇంపాక్ట్ చూపించలేదని తేల్చేశారు. ఒక నెటిజన్ అయితే నరేష్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.
Also Read: సినిమాలో ఆ క్రికెట్ మ్యాచ్ సీన్స్ లేవుగా... ‘పుష్ప 2’ డిలీటెడ్ సీన్స్ ఇంకా ఎన్ని దాచేశావ్ సుక్కు!?
పాజిటివ్ ట్వీట్ రివ్యూలు కొన్ని ఉన్నాయి!
సినిమాకు మొత్తం నెగెటివ్ రివ్యూలేనా, సోషల్ మీడియాలో ఒక్కరంటే ఒక్కరు కూడా సినిమా బావుందని చెప్పడం లేదా? అంటే... పాజిటివ్ ట్వీట్ రివ్యూలు కొన్ని ఉన్నాయి. మల్లిగాడు ఎప్పటికీ గుర్తుండి పోతాడని, తన జీవితంలోనూ కావేరి లాంటి అమ్మాయి ఒకరు కావాలని ఒక ఆడియన్ చెప్పారు. సోషల్ మీడియాలో 'బచ్చల మల్లి' సినిమాకు ఆడియన్స్ ఇచ్చిన రివ్యూ ఏంటో చూడండి.