Swiggy Report 2024: సంచలనాలతో Swiggy 2024 సంవత్సర వార్షిక నివేదిక విడుదల చేసింది, ఇది భారతీయుల ఆహారపు అలవాట్లు, ఇష్టమైన వంటకాల గురించి ఆసక్తికరమైన గణాంకాలు అందించింది. ఈ నివేదిక ప్రకారం బిర్యానీ మరోసారి దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకంగా మారింది. 2024లో స్విగ్గీలో మొత్తం 83 మిలియన్ల బిర్యానీ ఆర్డర్‌లు వచ్చాయి.
ప్రతి నిమిషానికి 158 బిర్యానీ ఆర్డర్లు
Swiggy వార్షిక డేటా ప్రకారం ఏడాది పొడవునా ప్రతి నిమిషం 158 బిర్యానీలు ఆర్డర్ చేశారు. అంటే ప్రతి సెకనుకు రెండు బిర్యానీలు ఆర్డర్ చేశారన్నమాట. చికెన్ బిర్యానీ అత్యంత ఇష్టపడే రకమని రిపోర్ట్ పేర్కొంది. ఈ చికెన్ బిర్యానీ 49 మిలియన్ ఆర్డర్‌లు వచ్చాయి.
ఎక్కడ బిర్యానీ ఎక్కువగా తింటారు
స్విగ్గీ రిపోర్ట్ ప్రకారం సౌత్ ఇండియాలోనే బిర్యానీకి క్రేజ్ ఎక్కువగా ఉంది. 2024లో 9.7 మిలియన్ బిర్యానీలు కేవలం సౌత్ ఇండియాలోనే చేశారు. అందులోనూ హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో ఉంది. దాని తర్వాత 7.7 మిలియన్ ఆర్డర్‌లతో బెంగళూరు రెండో స్థానంలో ఉంటే 4.6 మిలియన్ ఆర్డర్‌లతో మరియు చెన్నై మూడో స్థానంలో ఉంది.
అర్ధరాత్రి ఆకలిని తీర్చడానికి చికెన్
చికెన్‌తోనే అర్థరాత్రుళ్లు ప్రజలు ఆకలి తీర్చుకుంటున్నారని తేలింది. ఈ రిపోర్టు ప్రకారం 12 am, 2 am మధ్య అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలలో బిర్యానీ రెండో స్థానంలో ఉంది. ఈ సమయంలో ఆకలిని తీర్చడంలో చికెన్ బర్గర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇది కాకుండా రైళ్లలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం బిర్యానీగా తేలింది. Swiggy IRCTCతో భాగస్వామ్యం కలిగి ఉండటం వల్ల ఆ డేటాను కూడా స్విగ్గీ ఈ రిపోర్టులో పొందుపరించింది.
Also Read: బరువు తగ్గాలంటే చియా సీడ్స్‌ని అలా తీసుకోండి.. మధుమేహం కూడా తగ్గుతుందట
రంజాన్ సందర్భంగా బిర్యానీకి ప్రత్యేక డిమాండ్
రంజాన్ 2024 సందర్భంగా స్విగ్గీలో 6 మిలియన్ ప్లేట్ల బిర్యానీని ఆర్డర్ చేసినట్లు కూడా ఈ నివేదికలో పేర్కొంది. ఆ టైంలో కూడా హైదరాబాద్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఒక్క హైదరాబాద్ నుంచే 10 లక్షల ప్లేట్ల కంటే ఎక్కువ బిర్యానీలు ఆర్డర్ చేశారు.
ఫస్ట్ ఆర్డర్ బిర్యానీ
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సంవత్సరం ప్రారంభంలో మొదటి బిర్యానీ ఆర్డర్ కోల్‌కతా నుంచి చేశారట. జనవరి 1, 2024 ఉదయం 4:01 గంటలకు ఒక కస్టమర్ బిర్యానీని ఆర్డర్ చేశారు. ఈ బిర్యానీ క్రేజ్ స్విగ్గీ రిపోర్టుకే పరిమితం కాలేదు. Zomato విడుదల చేసిన గత నివేదికలో కూడా బిర్యానీదే టాప్ ప్లేస్.
Also Read: బీపీ ఎక్కువగా ఉండేవారు తినకూడని ఆహార పదార్థాలు ఇవే.. తినాల్సిన ఫుడ్ లిస్ట్