Chia Seeds for Weight Loss : బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ రొటీన్​లో చియా సీడ్స్​ని చేర్చుకోవచ్చు. కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం చియా సీడ్స్​ని తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి6, ఫోలేట్ విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేస్తాయి. 


బరువు తగ్గడానికే కాకుండా.. ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి, షుగర్ కంట్రోల్ అవ్వడానికి, వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం చియాసీడ్స్​ను తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే వీటిని పరగడుపునే తింటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తున్నారు. బరువు తగ్గడంతో పాటు.. వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు చియా సీడ్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయో ఇప్పుడు చూసేద్దాం. 


బరువు తగ్గడానికి.. 


చియా సీడ్స్​ని పరగడుపున తింటే.. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల కేలరీలు తీసుకోవడం తగ్గుతాయి. మంచి ఎనర్జీనిచ్చి.. అన్​ హెల్తీ ఫుడ్​ వైపు వెళ్లకుండా హెల్ప్ చేస్తుంది. వీటిలోని పోషకాలు, ప్రోటీన్, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్, ఆక్సిడెంట్లు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. కాబట్టి తక్కువగా తీసుకున్నా ఎనర్జీటిక్​గా ఉంటారు. దీనివల్ల మెటబాలీజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 


గుండె ఆరోగ్యానికై.. 


చియా సీడ్స్​లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్​ పెరగకుండా చేసి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కార్డియాక్ అరెస్ట్ కాకుండా హార్ట్​ను కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి. 


ఎముకల ఆరోగ్యానికి.. 


చియా సీడ్స్​లో కాల్షియం, పొటాషియం ఉంటాయి. ఇవి బోన్ డెన్సిటినీ పెంచుతాయి. ఎముకలను స్ట్రాంగ్​గా, హెల్తీగా చేయడంలో కూడా చియా సీడ్స్ మంచి ప్రయోజనాలు అందిస్తాయి. 


డిటాక్స్ 


శరీరాన్ని డిటాక్స్ చేసి.. శరీరంలోని మలినాలు, వ్యర్థాలను బయటకు పంపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పరగడుపునే దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమై.. శరీరం డీటాక్స్ అవుతుంది. జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 


మధుమేహాం.. 


చియాసీడ్స్​లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మధుమేహమున్నవారు కూడా వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 



చియాసీడ్స్​ని కేవలం పరగడుపునే కాకుండా.. సలాడ్స్​లో, ఓట్​మీల్​లో కలిపి తీసుకున్నా మంచిదే. అయితే పరగడుపునే తీసుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. మీరు వీటిని తీసుకోవాలనుకుంటే నిపుణుల సలహాలు తీసుకుని.. మీ డైట్​లో చేర్చుకోవాలి. 


Also Read : బరువు తగ్గేందుకు బొప్పాయిని పరగడుపునే తినాలట.. మరిన్నో బెనిఫిట్స్ కూడా



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.