Eating Papaya on an Empty Stomach : పోషకాలతో నిండిన పండ్లలో బొప్పాయి ఒకటి. దీనిని రెగ్యులర్‌గా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ, సి, ఈ ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్(Papaya Nutritions) కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, అందానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండిన బొప్పాయిని పరగడుపునే తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. మరి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? పరగడుపునే తింటే నష్టాలు కూడా ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకుంటే..
పరగడుపునే బొప్పాయి తినడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి హెల్ప్ అవుతుంది. జీవక్రియ ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు కరిగి.. ఎనర్జీ వస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
రోగ నిరోధక శక్తికై..
బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి.. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా హెల్ప్ చేస్తుంది. సీజనల్ వ్యాధులైన జలుబు, ఫ్లూ లక్షణాలను తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొత్తం ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.
జీర్ణ సమస్యలు దూరం
బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్‌తో నిండి ఉంటుంది. పరగడుపునే దీనిని తినడం వల్ల ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి మెరుగైన జీర్ణక్రియను అందించడంలో సహాయం చేస్తుంది.
మలబద్ధకం..
మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున బొప్పాయి తింటే మంచి ఫలితాలు చూస్తారు. దీనిలో పుష్కలంగా నీరు, ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి.. బౌల్ మూమెంట్స్‌ని ఈజీ చేస్తుంది.
అందానికై (చర్మానికి, జుట్టుకు)
పరగడుపునే బొప్పాయి తింటే దానిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి ఎన్నో బెనిఫిట్స్ అందిస్తాయి. స్కిన్ డ్యామేజ్ కాకుండా.. స్కిన్ హెల్త్‌ని ప్రమోట్ చేసి.. మెరిసే చర్మాన్ని అందిస్తాయి. విటమిన్ సి, న్యూట్రెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
మరిన్ని ప్రయోజనాలు
బొప్పాయిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయట. అలాగే పీరియడ్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరిచి.. వయసు పరంగా వచ్చే కంటి సమస్యలను దూరం చేస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
బొప్పాయితో ప్రయోజనాలున్నాయి కదా అని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. పండిన బొప్పాయి తింటే హెల్త్‌కి మంచిది. పండనిది తింటే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు పెరుగుతాయి. మీరు బొప్పాయిని డైట్లో చేర్చుకునే ముందు కచ్చితంగా వైద్యులు లేదా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Also Read : స్కిన్ సహజంగా గ్లో అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.