Simple Skin Care Routine : చర్మం సహజంగా మెరుస్తూ.. షైనీగా ఉంటే ఆ లుక్​ని మాటల్లో వర్ణించలేము. మేకప్​తో గ్లో లుక్​ని సింపుల్​గా తెచ్చుకోవచ్చు. కానీ మేకప్​ అనేది ఎప్పటికైనా.. ఎలా అయినా స్కిన్​ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి సహజంగా స్కిన్​కి మెరుపుని, గ్లోని అందించే రోటీన్​ని ఫాలో అవ్వాలి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాయామంతో పాటు కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ మార్పులు ఏంటి? చేర్పులు ఏంటి?


వ్యాయామం


ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా వ్యాయామం చాలా అవసరం. మీరు రోజూ వ్యాయామం చేస్తూ ఉంటే మీ స్కిన్​ గ్లో అవుతూ ఉంటుంది. మీరు కొన్ని రోజులు ఎక్సర్​సైజ్ చేసి చూస్తే ఈ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. కాబట్టి రెగ్యులర్​గా వర్క్​అవుట్​లు, వాకింగ్ వంటివి చేస్తూ ఉండండి. 


డైట్​


మీ గట్​ ఎంత హెల్తీగా ఉంటే.. మీ స్కిన్​ అంత గ్లోయింగ్​గా ఉంటుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే స్కిన్​ సహజంగా గ్లో అవుతుంది. పండ్లు, కూరగాయలు, పప్పులు, హెల్తీ ఫ్యాట్స్​ని డైట్​లో చేర్చుకుంటే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. 


నిద్ర 


నిద్ర అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిది. మీరు ఓ రోజు 8 గంటలు నిద్రపోయారంటే మీ స్కిన్​లో డిఫరెన్స్ తెలుస్తుంది. రోజూ ఇదే షెడ్యూల్ కంటిన్యూ చేస్తే స్కిన్​కి మంచి గ్లో రావడమే కాదు.. వృద్ధాప్య ఛాయలు కూడా దూరమవుతాయి. కాబట్టి నిద్ర విషయంలో కాంప్రిమైజ్ కాకండి. 


సన్​ స్క్రీన్


ఏ కాలంలోనైనా.. ఇంట్లోనే ఉన్నా.. సన్​స్క్రీన్ అస్సలు స్కిప్ చేయకూడదు. సన్​స్క్రీన్​ స్కిన్​ని కాపాడడమే కాకుండా.. సూర్య కిరణాల వల్ల స్కిన్​ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్​కి మంచి గ్లోని ఇవ్వడంతో పాటు.. హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేస్తుంది. స్కిన్​కి బారియర్​గా ఉంటుంది. 


ఎక్స్​ఫోలియేట్


స్కిన్​ని వారానికోసారైనా ఎక్స్​ఫోలియేట్ చేయాలి. దీనివల్ల స్కిన్​పై ఉండే డార్క్, టాన్​ అంతా పోతుంది. అంతేకాకుండా స్కిన్​ని కూడా బ్రైట్​గా చేస్తుంది. డెడ్​ సెల్స్​ని రిమూవ్ చేసి.. గ్లోని అందిస్తుంది. 


Also Read : సెలబ్రెటీలు పవర్​లిఫ్టింగ్ చేసేది ఇందుకే.. బెనిఫిట్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే


హైడ్రేషన్


స్కిన్​ని హెల్తీగా ఉంచడంలో, గ్లోని అందించడంలో హైడ్రేషన్ అనేది కీ అని చెప్పవచ్చు. కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగండి. ఇది స్కిన్​ హెల్త్​ని మెరుగుపరిచి.. సహజంగా మెరిసేలా చేస్తుంది. 


ఒత్తిడి


ఒత్తిడి కూడా స్కిన్​ హెల్త్​ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుంటే స్కిన్​ గ్లో అవుతుంది. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, యోగా వంటివి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. 



ఈ రోటీన్​ను రెగ్యూలర్​గా ఫాలో అయితే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. హెల్తీ స్కిన్ మీ సొంతమై.. వృద్ధాప్యఛాయలు దూరమవుతాయి. 


Also Read : ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు సింపుల్​గా ముస్తాబై, స్టన్నింగ్​గా కనిపించాలంటే కీర్తి సురేష్​ని ఫాలో అయిపోండిలా