Trinayani Serial Today Episode సుమన, విక్రాంత్ మాట్లాడుకుంటారు. పాప కావాలనే పేపర్లు పాడైనట్లు చేసిందా అని అడుగుతుంది. తను మా పెద్దమ్మా కాబట్టి అలా చేస్తుందని విక్రాంత్ అంటాడు. ఇంట్లో ఉన్నది మా అక్క కాదని అత్తయ్య వాళ్లు అంటున్నారు కానీ ఆమె వాళ్లకే ఎదురు తిరగడం చూస్తుంటే ఏదో తేడాగా ఉందని సుమన అంటుంది. పెద్ద గొడవ అయ్యేలా ఉందని అంటుంది. నయని వదిన రఫ్ఫాడించేస్తుందని విక్రాంత్ అంటాడు. కొత్త అక్క కూడా గట్టిగానే కొడుతుందని సుమన అంటుంది. 


మరోవైపు వల్లభ, తిలోత్తమలు మాట్లాడుకుంటారు. తిలోత్తమ తనకు జరిగిన అవమానంతో రగిలిపోతుంది. ఆ త్రినేత్రి నన్నే వార్నింగ్ ఇస్తుందా అని వల్లభ మీద అరుస్తుంది. గాయత్రీ పాప పేపర్ల మీద సంతకం పెట్టనివ్వకండా చేస్తే మరోపేపర్ల మీద విశాల్ సంతకం పెట్టకుండా త్రినేత్రి అడ్డుకుందని తిలోత్తమ కోపంతో ఊగిపోతుంది. విశాల్‌ని కూడా చంపేయాలని తిలోత్తమ అంటుంది. దాంతో వల్లభ అప్పుడు నయని ఉండదు విశాల్ ఉండడు మనకు తిరుగే ఉండదు మనదే ఈ సామ్రాజ్యం అని అంటాడు. అవునని తిలోత్తమ అంటే ఇదే మంచి సమయం అని తను నయని కాదు కాబట్టి భవిష్యత్ కనిపించడు కాబట్టి మన పని తేలిక అవుతుందని అంటాడు. చేద్దాం అని తిలోత్తమ అంటుంది.


ఇక విశాల్‌తో త్రినేత్రి అలా సంతకం పెట్టడానికి ఎందుకు సిద్ధపడ్డారు ఇంకెప్పుడు అలా చేయొద్దు అది ఎంత వరకు వారికి అవసరమో అన్నీ చూసి అప్పుడు మనకు లాభమా నష్టమా అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవాలని అంటుంది. ఇక తిలోత్తమ, వల్లభలు కిచెన్‌లోకి వెళ్తారు. గ్యాస్ లీక్ చేసి పెడితే త్రినేత్రి పాల కోసమే కాఫీ కోసమో వచ్చి మంటల్లో మండి పోతుందని అంటుంది. ఇక తిలోత్తమ గ్యాస్ లీక్ చేస్తుంది. ఇక గాయత్రీ పాప అక్కడికి రావడంతో వల్లభ పెద్దమ్మ వచ్చిందని చెప్తాడు. తిలోత్తమ కంగారు పడుతుంది. తర్వాత పాపని చూసి గత జన్మలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయావని నిన్ను చూడాలి అంటే తల ఎత్తి చూడాల్సి వచ్చేదని ఇప్పుడు నా మోకాలి అంత ఉన్నావని వెటకారంగా మారుతుంది.


ఇక పాపని చూస్తే కూడా కోపంగా ఉందని చెప్పి తన చేతికి మట్టి అంటకుండా చేస్తానని అని గాయత్రీ పాపని అక్కడే కూర్చొమని చెప్తుంది. పాప కూర్చొంటుంది. ఇక ఇద్దరూ వెళ్లిపోతారు. ఇక తిలోత్తమ కాఫీ పౌడర్ తీసుకెళ్లి త్రినేత్రితో ముక్కిపోయిన వాసన వస్తుందని చెప్తుంది. బాగుంది కదా అని త్రినేత్రి అంటుంది. అయినా తిలోత్తమ ఒప్పుకోదు దాంతో త్రినేత్రి అయితే ఈ కాఫీ పొడితోనే నీకు కాఫీ కలుపుకొస్తానని వంట గదిలోకి వెళ్తుంది. 


నయని కిచెన్‌లోకి వెళ్లి కాఫీ కలపడానికి రెడీ అయితే అక్కడే కూర్చొన్న గాయత్రీ పాప త్రినేత్రి మీదకు బాల్ విసిరికొడుతుంది. ఎందుకమ్మా అని త్రినేత్రి అంటుంది. ఇక త్రినేత్రి గ్యాస్ వెలిగించే టైంకి పాప అమ్మా అని పిలుస్తుంది. త్రినేత్రి పరశించిపోతుంది. గాయత్రీ పాప త్రినేత్రి దగ్గరకు వెళ్లి రెండు చేతులు పట్టుకుంటుంది. దాంతో త్రినేత్రికి తాను నయని అని గుర్తొస్తుంది. ఇక నయని తేరుకొని గ్యాస్ వాసన వస్తుందని చూసి గ్యాస్ ఆపుతుంది. ఇక వల్లభ బయట హ్యాపీడేస్ అని చిందులేస్తాడు. నయని పాపతో మనకు అన్యాయం చేయాలి అనుకున్నవారి కోసం కచ్చితంగా కాఫీ తీసుకెళ్దాం వాళ్లకి మనం ఏంటో ఈ పూట చూపిద్దాం అని అనుకుంటుంది. ఇంకా గ్యాస్ పేలిన శబ్ధం రావడం లేదు ఏంటి అని తిలోత్తమ అనుకుంటుంది. ఇక నయని రెండు కాఫీలు తీసుకెళ్తు వీళ్లకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయని పాపతో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఉండిపోవా నువ్విలా రెండు కళ్లలో ఇలా.. బావతో ఏకాంతంలో జ్యో.. దీప, కార్తీక్‌ల ఫస్ట్‌నైట్!