Keerthy Suresh Fashion : పెళ్లిళ్ల సమయం వచ్చేసింది. ఈ సమయంలో హల్దీ ఫంక్షన్లంటూ, పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకును చేయడం, పూజలు, వ్రతాలు వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమయంలో పెళ్లిల్లకు వెళ్లేందుకు ఎలా ముస్తాబు కావాలి? ఒక్కో ఈవెంట్​కి ఎలా ముస్తాబు కావొచ్చు.. సింపుల్​ లుక్​తో స్టన్నింగ్​గా ఎలా కనిపించవచ్చు.. ఎలాంటి డ్రెస్​లు ఎంచుకోవచ్చనేది చాలామంది అమ్మాయిలకు, మహిళకు ఉండే అతిపెద్ద ప్రశ్న. మీరు కూడా అలాంటి సందిగ్ధంలో ఉంటే మీరు కీర్తి సురేష్ స్టైల్​ని ఫాలో అవ్వొచ్చు. 


లెహంగా స్టైల్స్



పెళ్లి లేదా ఏ ఫంక్షన్ అయినా.. లెహంగాలు ఈజీ గో అని చెప్పొచ్చు. కీర్తి సురేష్ మాదిరిగా.. లెహంగా ధరిస్తే హెయయిర్ లీవ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా ముడి పెట్టుకుని పువ్వులు పెట్టుకోవచ్చు. అలాగే మెడలో భారీ స్టోన్స్​తో కూడిన నెక్లెస్, దానికి తగిన ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. మినిమల్, షైనీ మేకప్ లుక్​ ఈ తరహా లెహంగా లుక్​కి బాగా నప్పుతుంది. 


ఈవెనింగ్ ఫంక్షన్లకు




షైనీ లుక్​తో వచ్చే శారీ, బ్లౌజ్​లు ఈవెనింగ్ ఫంక్షన్లకు బాగా హెల్ప్ అవుతాయి. లైట్స్ కింద ఉన్నప్పుడు వాటి షైన్ మీకు మరింత గ్లామర్​ని లోడ్ చేస్తాయి. అయితే నైట్ ఫంక్షన్లకు బ్లౌజ్​ డిజైన్స్ ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ లీవ్ చేసి.. మినిమల్ జ్యూవెలరీతో.. లుక్​ని ఫైనల్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయితే సింపుల్​గా, ఎలిగెంట్​గా కనిపిస్తారు. 



టీనేజ్ అమ్మాయిలైతే..




టీనేజ్ అమ్మాయిలు ఫంక్షన్లకు శారీలు, లెహంగాలు అవాయిడ్ చేయాలనుకుంటే మంచిగా ఇలాంటి డ్రెస్​ని సెలక్ట్ చేసుకోవచ్చు. హల్దీ ఫంక్షన్లు వాటికి కూడా ఈ లుక్​ అద్భుతంగా సెట్ అవుతుంది. డ్రెస్​కి తగ్గట్లు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే హెయిర్ లీవ్ చేయకుండా ఇలా జడ వేసుకుంటే యూ లుక్ పర్​ఫెక్ట్. 


గోల్డెన్ శారీ




గోల్డెన్ రంగు ఉండే ఏ శారీ అయినా.. ఏ ఫంక్షన్​కి అయినా సెట్ అవుతాయి. ఇలాంటి శారీ మీరు కట్టుకున్నప్పుడు బ్లౌజ్​ని కాస్త డిజైన్​ వచ్చేలా కుట్టించుకుంటే.. లుక్​ అదిరిపోతుంది. మెడకి చౌకర్, చెవులకు ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు వేసుకుని.. సింపుల్​గా ముస్తాబైైనా గ్రాండ్​గా కనిపిస్తారు. 


సంగీత్​ లేదా బ్యాచిలర్ పార్టీ




పెళ్లిల్ల సమయంలో సంగీత్ లేదా బ్యాచిలర్ పార్టీకి వెళ్లేప్పుడు ఇలా మోడ్రన్ బాడీకాన్ డ్రెస్​లో వెళ్లొచ్చు. మోడ్రన్ లుక్ ఎంచుకుంటే హెయిర్​ని స్టైల్ చేయకుండా స్ట్రైట్​ చేయించుకోండి. అలాగే శారీ లుక్​లో వెళ్లాలనుకుంటే స్లీవ్ లెస్ బ్లౌజ్​ని ఎంచుకోవచ్చు. 


ఎంబ్రాయిడరీ శారీ లేకుంటే ఎలా




ఎంబ్రాయిడరీ శారీలు పెళ్లిల్లు, ఫంక్షన్లు, రిసెప్షన్లు, పూజలు.. ఇలా ఏ లుక్​కైనా.. ఏ వయసువారికైనా మంచి లుక్​ని ఇస్తాయి. ముఖ్యంగా ఇలాంటి పింక్​, సిల్వర్ కాంబినేషన్​లో వచ్చేవి కూడా మంచి లుక్​ని ఇస్తాయి. జ్యూవెలరీ సెట్, గాజులు, పువ్వులు ఉంటే చాలు. మీ లుక్​ కంప్లీట్ అయిపోతుంది. 


మళ్లు కుట్టీ లుక్​




ఓనమ్ సమయంలో మలయాళీలు ముస్తాబైనట్లు వైట్ లేదా క్రీమ్ శారీని కట్టుకుని ఎలాంటి జ్యూవెలరీ పెట్టుకోకుండా.. గ్లోయింగ్ మేకప్ లుక్ వేసుకుంటే చాలు. అందమైన లుక్ మీ సొంతమవుతుంది. 



అన్నీ లుక్స్ కూడా సింపుల్​, ఎలిగెంట్​ లుక్స్​ని ఇస్తాయి. మినిమల్ మేకప్​ అయినా.. వేసుకునే డ్రెస్​, వాటిని క్యారీ చేసే విధానం మిమ్మల్ని గ్లామర్​గా ఉండేలా చేస్తుంది. కీర్తి సురేష్ ఇదే ఫార్మూలాను ఫాలో అవుతుంది. మీరు కూడా ఫంక్షన్ల సమయంలో స్టన్నింగ్​గా కనిపించేందుకు కీర్తి సురేష్​ లుక్స్​ని ఫాలో అయిపోవచ్చు. 


Also Read : శోభిత ధూళిపాల స్కిన్​ కేర్ రోటీన్.. ఆ ఒక్కటి లేకుంటే ఎన్ని సర్జరీలు చేయించుకున్నా లాభం లేదంటోన్న బ్యూటీ